LIC Housing Loan: భారీగా హోమ్‌ లోన్‌ వడ్డీ రేట్లను తగ్గించిన ఎల్‌ఐసీ.. వెంటనే త్వరపడండి. ఎందుకంటే ఈ అవకాశం.

LIC Housing Loan: మీరు హోమ్‌ లోన్‌ కోసం ప్రయత్నిస్తున్నారా.? అయితే మీకు ఇది నిజంగా గుడ్‌ న్యూస్‌ అని చెప్పాలి. జీవిత భీమాకే పరిమితం కాకుండా లోన్స్‌లోనూ దూసుకుపోతున్న ఎల్‌ఐసీ తాజాగా వడ్డీరేట్లను భారీగా తగ్గించింది...

LIC Housing Loan: భారీగా హోమ్‌ లోన్‌ వడ్డీ రేట్లను తగ్గించిన ఎల్‌ఐసీ.. వెంటనే త్వరపడండి. ఎందుకంటే ఈ అవకాశం.
Lic Home Loan
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 03, 2021 | 10:15 AM

LIC Housing Loan: మీరు హోమ్‌ లోన్‌ కోసం ప్రయత్నిస్తున్నారా.? అయితే మీకు ఇది నిజంగా గుడ్‌ న్యూస్‌ అని చెప్పాలి. జీవిత భీమాకే పరిమితం కాకుండా లోన్స్‌లోనూ దూసుకుపోతున్న ఎల్‌ఐసీ తాజాగా వడ్డీరేట్లను భారీగా తగ్గించింది. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో హోమ్‌ లోన్‌ తీసుకున్న వారికి ఈ వెసులుబాటును కలపించింది. కొత్తగా లోన్‌ తీసుకునే వారికి 6.66 శాతానికే హోమ్‌ లోన్‌ ఇవ్వనున్నట్లు ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌ తెలిపింది. అయితే దీని కోసం పరిమిత కాలాన్ని గడువుగా విధించారు. ఆగస్టు 31లోపు రుణాలు తీసుకునే వారికి మాత్రమే ఈ రేట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్ వర్తిస్తుంది. ఇందులో భాగంగా రుణ గ్రహీతలు సెప్టెంబర్‌ 30లోగా తీసుకోవాలని తెలిపారు. రూ. 50 లక్షల లోపు రుణం తీసుకునే వినియోగదారులకు ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. లోన్‌ తీసుకునే వారి సిబిల్‌ స్కోర్‌ ఆధారంగా రుణ పరిమితిని నిర్ణయించనున్నారు. ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో ఎల్‌ఐసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్‌ మొబైల్‌ యాప్‌ హోమీ ద్వారా ఆన్‌లైన్‌లో రుణానికి దరఖాస్తు చేసుకుంటే.. ఇంటి వద్దకే వచ్చి సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా సంక్షోభం తర్వాత సొంతింటిని ప్లాన్‌ చేస్తున్న వారి సంఖ్య బాగా పెరిగిందని, వారి ఆకాంక్షలను నిజం చేసేందుకుగానే తక్కువ వడ్డీకి గృహరుణాన్ని అందిస్తున్నట్లు ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ వై.విశ్వనాథ గౌడ్‌ తెలిపారు. సొంతింటి కలను నిజం చేయడమే కాకుండా నిర్మాణ రంగానికి కూడా ప్రోత్సాహంగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

Also Read: Voter ID Address Change: మీ ఓటర్‌ ఐడీ కార్డులో అడ్రస్‌ను మార్చాలనుకుంటున్నారా..? ఇలా చేయండి

Paytm: పేటీఎం బంపర్‌ ఆఫర్‌.. రూ.50 కోట్ల క్యాష్‌బ్యాక్‌లు.. యాప్‌ ద్వారా చెల్లింపులు జరిపే వారికి బెనిఫిట్స్‌..!

NPPA: వినియోగదారులకు షాకింగ్‌.. భారీగా పెరగనున్న మూడు డ్రగ్స్‌ ధరలు.. పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన ఎన్‌పీపీఏ