Voter ID Address Change: మీ ఓటర్ ఐడీ కార్డులో అడ్రస్‌ను మార్చాలనుకుంటున్నారా..? ఇలా చేయండి
Voter ID Address Change: మీ ఓటర్ ఐడీ కార్డుపై అడ్రస్ మార్చాలనుకుంటున్నారా? ఒక అడ్రస్ నుంచి మరో అడ్రస్‌కు మారారా? సులభంగా ఓటర్ ఐడీ కార్డుపై అడ్రస్ మార్చవచ్చు...
Voter ID Address Change: మీ ఓటర్ ఐడీ కార్డుపై అడ్రస్ మార్చాలనుకుంటున్నారా? ఒక అడ్రస్ నుంచి మరో అడ్రస్‌కు మారారా? సులభంగా ఓటర్ ఐడీ కార్డుపై అడ్రస్ మార్చవచ్చు. ఓటర్ ఐడీ కార్డును ఐడీ ప్రూఫ్‌గా, అడ్రస్ ప్రూఫ్‌గా ఉపయోగించడం సర్వసాధారణమైన విషయమే. అందుకే ఓటర్ ఐడీ కార్డులోని వివరాలన్నీ అప్‌డేట్ చేసుకోవడం మంచిది. అడ్రస్ మారినప్పుడు ఓటర్ ఐడీ కార్డులో అడ్రస్ కూడా మార్చుకోవచ్చు. లేదా అదే అడ్రస్‌లో ఉంటే ఎన్నికల సమయంలో ఓటు సేమ్ అడ్రస్‌లో వస్తుంది. అక్కడే ఓటు వేయాల్సి వస్తుంది. ఒకవేళ అడ్రస్ మార్చాలనుకుంటే మాత్రం అందుకోసం దరఖాస్తు చేయాలి.
అయితే ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లో కూడా అడ్రస్ మార్చడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఓటర్ ఐడీ కార్డు చిరునామా మర్చడానికి ముందుగా నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ (NVSP) వెబ్‌సైట్ https://www.nvsp.in/ ఓపెన్ చేసి అందులో మీ వివరాలతో లాగిన్ కావాలి. ఆ తర్వాత Forms పైన క్లిక్ చేయాలి. వేర్వేరు ఫామ్స్ ఓపెన్ అవుతాయి. అందులో Form 6 పైన క్లిక్ చేయాలి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మీ ఓటు మార్చేందుకు, ఓటర్ ఐడీ కార్డులో అడ్రస్ మార్చేందుకు ఈ ఫామ్ ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు ఒకే నియోజకవర్గంలో వేరే ప్రాంతానికి మారినట్లయితే Form 8A పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పేరు, పుట్టిన తేదీ, రాష్ట్రం, నియోజకవర్గం, ప్రస్తుత అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ లాంటి వివరాలన్నీ ఎంటర్ చేయాలి.
మీ ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ కూడా తెలుపాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫోటో, అడ్రస్ ప్రూఫ్, వయస్సు ధృవీకరణ పత్రం లాంటి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. వేరే నియోజకవర్గంలోకి అడ్రస్ మార్చాలనుకుంటే Form 6, ఒకే నియోజకవర్గంలో అడ్రస్ మారితే Form 8A డౌన్‌లోడ్ చేయాలి. ఫామ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి మీ సమీపంలోని ఎన్నికల అధికారి కార్యాలయంలో అందజేయాలి.
ఓటర్ ఐడీలో అడ్రస్ మార్చడానికి సబ్మిట్ చేసిన అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి ఓటర్ ఐడీ అడ్రస్ మార్చేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినట్లుగానే https://www.nvsp.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Track Application Status పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత రిఫరెన్స్ ఐడీ ఎంటర్ చేయాలి. Track Status పైన క్లిక్ చేయాలి. మీ దరఖాస్తు స్టేటస్ తెలుస్తుంది.