Reliance Jio Data Loan: జియో కొత్త ఆఫర్.. అత్యవసర సమయంలో డేటా లోన్ తీసుకోవచ్చు.. వివరాలు
JIO New Offer: టెలికాం రంగంలో ఓ పెను సంచలనంగా దూసుకొచ్చింది రిలయన్స్ జియో. ఎన్నడూ లేని విధంగా తక్కువ ధరలో వేగమైన ఇంటర్నెట్ అందించి యూజర్లను ఆకర్షించింది. ఇక ఎప్పటికప్పుడు కొంగొత్త రీఛార్జ్ ఆఫర్లతో వినియోగదారులను...
Reliance Jio Data New Offer: టెలికాం రంగంలో ఓ పెను సంచలనంగా దూసుకొచ్చింది రిలయన్స్ జియో. ఎన్నడూ లేని విధంగా తక్కువ ధరలో వేగమైన ఇంటర్నెట్ అందించి యూజర్లను ఆకర్షించింది. ఇక ఎప్పటికప్పుడు కొంగొత్త రీఛార్జ్ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా డేటా విషయంలో జియో తీసుకొచ్చిన రీఛార్జ్ ఆప్షన్స్‌తో ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది జియో. ఈక్రమంలోనే తాజాగా మరో ఆకర్షణీయమైన ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా ఇంటర్నెట్ ఉపయోగిస్తోన్న సమయంలో రోజు వారి డేటా పూర్తయితే నెట్ స్పీడ్ తగ్గిపోతుంది. ఒకవేళ స్పీడ్ పెంచుకోవాలంటే మళ్లీ తప్పనిసరిగా రీఛార్జ్ చేసుకోవాలి. మరి అప్పటికప్పుడు డబ్బులు లేకపోవడమో, రీఛార్జ్ చేసే అవకాశం లేకపోతే ఎలా.? ఇందుకోసమే జియో ‘రీఛార్జ్ నౌ అండ్ పే లేటర్’ అనే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. దీంతో యూజర్లు 1జీబీ డేటా ఉన్న డేటా ప్లాన్‌లను (రూ. 11) అప్పుగా తీసుకొవచ్చు. ఇలా ఒక్కో యూజర్‌కు ఐయిదు సార్లు ఈ అవకాశం కల్పించారు. రీఛార్జ్ ధరను యూజర్లు తర్వాత చెల్లించే వెసులుబాటు కల్పించారు.
ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే..
* యూజర్లు ముందుగా మైజియో యాప్‌ను ఓపెన్ చేసి ‘మెను’ ఆప్షన్‌లోకి వెళ్లాలి. * అనంతరం మొబైల్ సర్వీసెస్‌లో ‘ఎమర్జెన్సీ డేటా లోన్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. * తర్వాత ‘ప్రొసీడ్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ‘గెట్ ఎమర్జెన్సీ డేటా’పై క్లిక్ చేయాలి. * అనంతరం ‘యాక్టివ్ నౌ’ పై క్లిక్ చేయగానే వెంటనే ఎమర్జెన్సీ డేటా లోన్ యాక్టివ్ అయిపోతుంది.
Also Read: SBI customers ALERT!: SBI ఖాతాదారులకు అలర్ట్.. ఆదివారం ఈ సేవలకు అంతరాయం