అయితే ఇక్కడ అదృష్టం ఏంటంటే, పిడుగు పడినా.. ఆ కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎవరికీ ప్రమాదం జరుగలేదు. దాంతో కారులోని వారంతా ఊపిరి పీల్చుకున్నారు. కారులో ముగ్గురు చిన్నారులు(8 నెలలు, ఒకటిన్నర సంవత్సరాలు, 3 సంవత్సరాలు) సహా ఇద్దరు దంపతులు ఉన్నారు. పిడుగు పాటులో షాక్‌కు గురైన వారు కొద్దిసేపటి వరకు అదే ట్రాన్స్‌లో ఉన్నారు. ఆ షాక్ నుంచి కోలుకున్న తరువాత అందరూ క్షేమంగా ఉన్నారా? లేదా అని చెక్ చేసుకున్నారు. ముగ్గురు చిన్న పిల్లలు సహా అందరూ క్షేమంగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే, పిడుగుపాటు కారణంగా కారు పూర్తిగా చెడిపోయింది. దాంతో ఆ కారును రోడ్డు పక్కకు జరిపారు. కారులోని వారి మరో వాహనంలో వెళ్లిపోయారు.
కాగా, ఈ ఘటన జూన్ 25వ తేదీన జరుగగా.. కారు పిడుగుపాటుకు గురైన వీడియోను కార్ల్ హోబీ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మొత్తం 13 సెకన్ల పాటు ఉన్న ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియోను మీరు చూసేయండి.
Viral Video:
Also read:
SBI customers ALERT!: SBI ఖాతాదారులకు అలర్ట్.. ఆదివారం ఈ సేవలకు అంతరాయం
Weight Lose: ఊబకాయంతో బాధపడుతున్నారా..? అయితే రాగులను మీ డైట్‌లో చేర్చండి.. ఎందుకంటే..?