Pawan kalyan: పవన్‌ కళ్యాణ్‌ రీమేక్‌ సినిమా టైటిల్‌ ఇదేనా.? నెట్టింట వైరల్‌ అవుతోన్న కొత్త సినిమా టైటిల్‌.

Pawan kalyan New Movie: అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన పవన్‌ మళ్లీ వెండి తెర ఎంట్రీ ఇచ్చి ఆయన అభిమానుల్లో జోష్‌ నింపారు. వకీల్‌సాబ్‌తో తనలోని స్టామినా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు. దాదాపు రెండేళ్ల గ్యాప్‌ తర్వాత..

Pawan kalyan: పవన్‌ కళ్యాణ్‌ రీమేక్‌ సినిమా టైటిల్‌ ఇదేనా.? నెట్టింట వైరల్‌ అవుతోన్న కొత్త సినిమా టైటిల్‌.
Pawan Kalyan New Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 03, 2021 | 1:32 PM

Pawan kalyan New Movie: అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన పవన్‌ మళ్లీ వెండి తెర ఎంట్రీ ఇచ్చి ఆయన అభిమానుల్లో జోష్‌ నింపారు. వకీల్‌సాబ్‌తో తనలోని స్టామినా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు. దాదాపు రెండేళ్ల గ్యాప్‌ తర్వాత వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పవర్‌ స్టార్‌ రేంజ్‌ ఏంటో తెలిపింది. ఇక పవన్‌ అభిమానుల్లో అదే జోష్‌ను కొనసాగిస్తూ పవన్‌.. వరుస సినిమాలకు సైన్ చేస్తూ దూసుకుపోతున్నారు. ఇక పవన్‌ సినిమాకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలోనే పవన్‌ కొత్త చిత్రం టైటిల్‌ ఇదేనంటూ ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియ‌మ్ సినిమా తెలుగు రీమేక్‌లో పవన్‌ నటిస్తోన్న విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభమైనప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది. సాగర్‌ చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ మాటలు అందిస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు ‘పరుశురామ కృష్ణమూర్తి’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి నెట్టింట చక్కర్లు కొడుతోన్న ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియాలంటే అధకారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తోన్న విషయం తెలిసిందే.

Also Read: Kudi Yedamaithe : ‘ఆహా’ అనిపించేలా అమలాపాల్ వెబ్ సిరీస్.. ఆద్యంతం ఆసక్తికరంగా టీజర్

Aamir Khan: సినిమాల్లో మిస్టర్‌ పర్ఫెక్ట్.. రియల్ లైఫ్‌లో మిస్టర్ బ్రేకప్స్‌.. రెండో భార్యతో విడిపోయిన అమీర్ ఖాన్

Cinematograph Act: సినిమాటోగ్రఫీ చట్ట సవరణపై తీవ్రమవుతోన్న వ్యతిరేకత.. కేంద్రానికి తమ అభ్యంతరాలు తెలియజేసిన..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!