Kudi Yedamaithe : ‘ఆహా’ అనిపించేలా అమలాపాల్ వెబ్ సిరీస్.. ఆద్యంతం ఆసక్తికరంగా టీజర్

మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని,నాణ్య‌మైన హండ్రెడ్ ప‌ర్సెంట్‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందించ‌డానికి రూపొందిన ఏకైక తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’.

Kudi Yedamaithe : 'ఆహా' అనిపించేలా అమలాపాల్ వెబ్ సిరీస్.. ఆద్యంతం ఆసక్తికరంగా టీజర్
Kudi Yedamaithe
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 03, 2021 | 12:35 PM

Kudi Yedamaithe :

మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని, హండ్రెడ్ ప‌ర్సెంట్‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందించ‌డానికి రూపొందిన ఏకైక తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’. ప్రారంభం నుంచి ప్రేక్ష‌కులు అంచ‌నాల‌కు ధీటైన కంటెంట్‌ను అందిస్తూ వారి హృద‌యాల్లో తిరుగులేని స్థానాన్ని ద‌క్కించుకుంటుంది. బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షోస్‌తో ఇత‌ర డిజిట‌ల్ మాధ్య‌మాల‌కు ‘ఆహా’ గ‌ట్టి పోటీనిస్తోంది. ఫ్రెష్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్న తెలుగు ఓటీటీ సంస్థ ఆహా త్వరలో మరో ఇంట్రస్టింగ్ వెబ్ సిరీస్ కుడిఎడమైతే . స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ కథాంశంతో రానున్న ఈ సిరీస్‌పై ఇప్పుడు అంద‌రి దృష్టి ని ఆకర్షిస్తుంది. ఈ సిరీస్ లో అమలా పాల్ తో పాటు ‘సూర్య కాంతం’ సినిమాతో హీరో గా గుర్తింపు పొందిన ఫైట్ మాస్టర్ విజయన్ కుమారుడు రాహుల్ విజయ్ నటిస్తున్నాడు. ‘లూసియా’ తెలుగులో ‘నాలో ఒకడు’ మరియు ‘యూ టర్న్’ సినిమాలని డైరెక్ట్ చేసిన పవన్ కుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నారు.

విభిన్న కథలను ఎంచుకుంటూ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు అమలాపాల్. ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో పైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు అమలాపాల్.  ఇప్పుడు కుడి ఎడమైతే అంటూ సస్పెన్స్ థ్రిల్లర్ తో రానున్నారు. ఇక ఈ సిరీస్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. టీజర్ ఆద్యంతం ఎంతో ఆసక్తిగా సాగింది. మీకెప్పుడైనా లైఫ్ లో జరిగిందే మళ్ళీ మళ్ళీ జరిగినట్లు అనిపించిందా?’ అని అమలా పాల్ చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది . రవి ప్రకాష్ కీలక పాత్రలో నటించాడు. ఇది ఎమోషన్స్ – థ్రిల్స్ కలబోసిన టైం లూప్ క్రైమ్ థ్రిల్లర్ అని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. అమలాపాల్ ఈ వెబ్ సిరీస్ లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. జులై 16 ఈ వెబ్ సిరీస్ ఆహా వేదికగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ ఇంట్రస్టింగ్ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి ..

aha

మరిన్ని ఇక్కడ చదవండి :

Karthika Deepam: సౌందర్యకు, దీపకు పెళ్లి బట్టలు కొన్న మోనిత.. తనకు చిరాకు తెప్పిస్తే.. రచ్చరచ్చ చేస్తానంటూ కార్తీక్ కు వార్నింగ్

Dhanush : హైదరాబాద్ లో తమిళ్ స్టార్ హీరో.. ధనుష్ ను కలిసిన శేఖర్ కమ్ముల.. కాసేపు మాట మంతి

Accident: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడి కుమారుడికి గాయాలు.. ఆసుపత్రిలో చికిత్స

ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?