ఏడాది పూర్తి చేసుకున్న `ఆహా` తొలి డైరెక్ట్ ఓటీటీ బ్లాక్ బ‌స్ట‌ర్ `భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ`

తెలుగు ఓటీటీ  'ఆహా'లో విడుద‌లై మంచి టాక్ సొంతం చేసుకున్న ప్రేమ క‌థాచిత్రం `భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ`. ఈ సినిమా విడుదలై (జూలై 3,2020) నేటికి స‌రిగ్గా ఏడాది అయ్యింది.

ఏడాది పూర్తి చేసుకున్న `ఆహా` తొలి డైరెక్ట్ ఓటీటీ బ్లాక్ బ‌స్ట‌ర్ `భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ`
Bhanumathi And Ramakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 03, 2021 | 2:48 PM

తెలుగు ఓటీటీ  ‘ఆహా’లో విడుద‌లై మంచి టాక్ సొంతం చేసుకున్న ప్రేమ క‌థాచిత్రం `భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ`. ఈ సినిమా విడుదలై (జూలై 3,2020) నేటికి స‌రిగ్గా ఏడాది అయ్యింది. ఈ సినిమా ప్రేక్ష‌కులంద‌రి మ‌న‌సుల‌ను హ‌త్తుకుంది. న‌వీన్ చంద్ర‌, స‌లోని లుథ‌ర జంట‌గా న‌టించారు. మూడు ప‌దుల వ‌య‌సులోని ఇద్ద‌రు వ్య‌క్తులు.. తెనాలిలో పుట్టి పెరిగిన రామ‌కృష్ణ‌కు, సిటీ వాతావ‌ర‌ణంలో పుట్టి పెరిగిన అమ్మాయి భానుమ‌తికి మ‌ధ్య ప్రేమ చిగురిస్తే ఎలా ఉంటుంద‌నేదే ఈ సినిమా క‌థాంశం అంద‌రినీ ఆక‌ట్టుకుంది. శ్రీకాంత్ నాగోటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం..వాస్త‌వానికి ద‌గ్గ‌రగా ఉండే ప్రేమ‌, హాస్యం వంటి డిఫ‌రెంట్ ఎమోష‌న్స్ తో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది.  ఆహాలో డైరెక్ట్‌గా విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన `భానుమ‌తి అండ్ రామకృష్ణ‌` చిత్రాన్ని ఇటు ప్రేక్ష‌కులు, అటు విమ‌ర్శ‌కుల ప్రసంశలు అందుకుంది. ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా వీక్షించాల్సిన టాప్ టెన్ చిత్రాల్లో `భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ` ఒక‌టి అంటూ  సర్వత్రా ప్రశంసలు దక్కాయి. తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన తొలి తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాకు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో ఓ న‌మ్మ‌కాన్ని ఏర్ప‌రిచిన చిత్రంగా నిలిచిందీ చిత్రం.

ఓటీటీ డెబ్యూ మూవీగా `భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ` తెచ్చిన గుర్తింపు గురించి హీరో న‌వీన్ చంద్ర మాట్లాడుతూ “`భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ` న‌టుడిగా న‌న్ను నేను గుర్తించ‌డంతో ఎంత‌గానో స‌హాయ‌ప‌డింది. న‌టుడిగా ఈ సినిమాను వ‌దులుకోలేక‌పోయాను. రామ‌కృష్ణ‌లా ఉండే చాలా మంది యువ‌కుల ప్ర‌తినిధిగా క‌నిపించాను. త‌నకు జీవితంలో బాధ‌ను క‌లిగించే విష‌యాన్ని అయినా కూడా సంతోషంగా స్వాగ‌తించే సిగ్గ‌రి అయిన‌ యువ‌కుడే రామ‌కృష్ణ‌. ఇలాంటి ఓ క‌థను న‌మ్మి దాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చిన `ఆహా`కు ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను అన్నారు.

స‌లోని లుథ‌రా మాట్లాడుతూ “డైరెక్ట‌ర్ శ్రీకాంత్ నాగోటి భానుమ‌తి అనే డిఫ‌రెంట్ అమ్మాయి పాత్ర‌ను క్రియేట్ చేశారు. అందుకు ఆయ‌న‌కు థాంక్స్‌. మూడు ప‌దుల వ‌య‌సులో పెళ్లి కానీ యువ‌త ఆలోచ‌న‌ల‌ను వాస్త‌విక‌త‌కు ద‌గ్గ‌ర‌గా చూపిస్తూ సినిమాను రూపొందించారు. ఓ న‌టిగా ఇంత మంచి సినిమా కంటే గొప్ప‌గా ఏదీ కోరుకోలేను“ అన్నారు. శ్ర‌వ‌ణ్ భ‌రద్వాజ్ అద్భుత‌మైన సంగీతం.. న‌వీన్ చంద్ర‌, స‌లోని లుథ‌రా పెర్ఫామెన్స్‌, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ నాగోటి జీవితంలో ప్రేమ‌ను ఆవిష్క‌రించిన తీరు ప్రేక్షకులను అక్కట్టుకుంది.  భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ‌తో పాటు లేటెస్ట్‌గా రిలీజ్ అయిన ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌, అర్థ శ‌తాబ్దం, లెవ‌న్త్ అవ‌ర్‌, క్రాక్‌, జాంబి రెడ్డి, నాంది, సుల్తాన్‌, చావు క‌బురు చ‌ల్ల‌గా వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌, వెబ్ షోస్ ఆకట్టుకుంటున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Pooja Hegde : దళపతి ‘బీస్ట్’ కోసం చెన్నైకు చెక్కేసిన బుట్ట బొమ్మ పూజ… ( వీడియో )

Actor Arrested: బాలికను లైంగికంగా వేధించాడంటూ నటుడిపై కేసు నమోదు.. అరెస్ట్‌ చేసిన పోలీసులు.

Ramya Krishnan: రిపబ్లిక్ లో పవర్ ఫుల్ పాత్రలో రాజమాత.. సాయి ధరమ్ తేజ్ కు సవాల్ విసురుతున్న రమ్యకృష్ణ

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!