AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aamir Khan: సినిమాల్లో మిస్టర్‌ పర్ఫెక్ట్.. రియల్ లైఫ్‌లో మిస్టర్ బ్రేకప్స్‌.. రెండో భార్యతో విడిపోయిన అమీర్ ఖాన్

Aamir Khan Kiran Rao Divorce: బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ తన భార్యకు విడాకులు ఇస్తున్నట్టు  ప్రకటించారు. ఇష్టపూర్వకంగానే ఆమీర్ ఖాన్, ఆయన భార్య కిరణ్  విడిపోతున్నట్లు ప్రకటించారు.

Aamir Khan: సినిమాల్లో మిస్టర్‌ పర్ఫెక్ట్.. రియల్ లైఫ్‌లో మిస్టర్ బ్రేకప్స్‌.. రెండో భార్యతో విడిపోయిన అమీర్ ఖాన్
ఏప్రిల్ 18, 1986న ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాలో కొంత భాగం నటించిన నటి రీనా దత్తాను వివాహమాడిన అమీర్ ఖాన్. వారికి ఒక కుమారుడు జునైద్, కుమార్తె ఇరా. లగాన్ సినిమా నిర్మాణంలో ఆమిర్ కు సహాయం చేసిన రీనా. డిసెంబరు 2002న విడాకులు.
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 03, 2021 | 1:41 PM

Aamir Khan Kiran Rao Divorce:   అమీర్ ఖాన్ ! సినిమాల్లో మిస్టర్‌ పర్ఫెక్ట్.. రియల్ లైఫ్‌లో మిస్టర్ బ్రేకప్స్‌… అవును బాలీవుడ్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. సినిమాల్లో ఎంత కష్టపడి ఇష్టపడి నటిస్తారో… సినిమాల బయట అంతే కష్టపడి ఇష్టపడి నటించలేక పోతుంటారు. రిలేషన్ షిప్స్‌ను బ్రేక్‌ చేస్తుంటారు అమీర్ ఖాన్. ఆయన తన భార్యతో విడిపోతున్నట్టు  ప్రకటించారు. ఇష్టపూర్వకంగానే ఇద్దరు విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే అమీర్ ఆయన సతీమణి కిరణ్ కలిసి ఈ ప్రకటన విడుదల చెయ్యడం విశేషం.  ఇద్దరూ కలిసి ప్రకటన విడుదల చెయ్యడం విశేషం.  బాలీవుడ్ లో ప్రస్తుతం అమీర్ ఖాన్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. 1986న ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాలో నటించిన నటి రీనా దత్తాను ఆయన వివాహం చేసుకున్నారు . వారికి ఒక కుమారుడు జునైద్, కుమార్తె ఇరా ఉన్నారు. ఆ తర్వాత డిసెంబరు 2002న ఇద్దరూ విడాకులు తీసుకున్నారు . ఇప్పుడు రెండో భార్య అయిన కిరణ్ తో కూడా ఆయన విడిపోయారు.

28 డిసెంబరు 2015న  అమీర్ ఖాన్ కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. లగాన్ సినిమా దర్శకుడు అశుతోశ్ గోవరికర్ వద్ద సహాయ దర్శకురాలిగా కిరణ్ రావు పనిచేసారు. ఆ సమయంలోనే ఈ ఇద్దరు ఒకరినొకరుఇష్టపడి వివాహం చేసుకున్నారు . ఇక అమీర్ – కిరణ్ విడుదల చేసిన ప్రకటనలో..  “ఈ 15 అందమైన సంవత్సరాల్లో మేము జీవితకాలనికి సరిపడ అనుభవాలు, ఆనందం ,నవ్వులను పంచుకున్నాము, అలాగే మామధ్య నమ్మకం, గౌరవం ప్రేమ కూడా పెరిగింది. ఇప్పుడు మేము విడివిడిగా  కొత్తజీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాము అని తెలిపారు. అదేవిధంగా త‌మ కుమారుడి బాధ్య‌త‌ను ఇద్ద‌రం తీసుకుంటామ‌ని అన్నారు. సినిమాలు, పానీ ఫౌండేష‌న్ కార్య‌క‌లాపాల్లో క‌లిసే ప‌నిచేస్తామ‌ని చెప్పారు. తాము విడిపోవాల‌ని కొంత కాలం క్రితమే నిర్ణ‌యం తీసుకుని ఇప్పుడు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామ‌ని వివ‌రించారు. అయితే ఇప్పుడు రెండో భార్య తోనూ అమీర్ ఖాన్ విడిపోతుండటం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Cinematograph Act: సినిమాటోగ్రఫీ చట్ట సవరణపై తీవ్రమవుతోన్న వ్యతిరేకత.. కేంద్రానికి తమ అభ్యంతరాలు తెలియజేసిన..

Karthika Deepam: సౌందర్యకు, దీపకు పెళ్లి బట్టలు కొన్న మోనిత.. తనకు చిరాకు తెప్పిస్తే.. రచ్చరచ్చ చేస్తానంటూ కార్తీక్ కు వార్నింగ్

Dhanush : హైదరాబాద్ లో తమిళ్ స్టార్ హీరో.. ధనుష్ ను కలిసిన శేఖర్ కమ్ముల.. కాసేపు మాట మంతి