Art Director Leeladhar: దాదా సాహెబ్ అవార్డు విన్నర్.. నేడు రోజు గడవనిస్థితిలో సహాయంకోసం ఎదురు చూపులు
Art Director Leeladhar: సినీ పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుని అవార్డులు అందుకున్న వారు సైతం తమ జీవితం చరమాంకంలో ఆర్ధిక కష్టాలతో రోజు గడవని స్థితిలో బతికినవారు ఎందరో ఉన్నారు..
Art Director Leeladhar: సినీ పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుని అవార్డులు అందుకున్న వారు సైతం తమ జీవితం చరమాంకంలో ఆర్ధిక కష్టాలతో రోజు గడవని స్థితిలో బతికినవారు ఎందరో ఉన్నారు. అవకాశాలతో పాటు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకున్న ఆర్ట్ డైరెక్టర్ లీలాధర్ ప్రస్తుతం దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు.
ఆర్ట్ డైరెక్టర్ లీలాధర్ సావంత్ 25 ఏళ్ల పాటు పరిశ్రమలో పలు హిట్ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా గెలుచుకున్నారు. ప్రస్తుతం ఆయన భార్య పుష్ప సావంత్‌తో కలిసి మహారాష్ట్ర వాషిమ్ జిల్లాలోని జౌల్కా గ్రామంలో నివసిస్తున్నారు. పుష్ప సావంత్ తమ ఆర్ధిక పరిస్థితి వివరిస్తూ.. సినీ పరిశ్రమలోని పెద్దలు పెద్దమనసుతో ఆదుకోమని విజ్ఞప్తి చేశారు. తన భర్త లీలాధర్‌కు గతంలో రెండు సార్లు బ్రెయిన్ హేమరేజ్ చికిత్స జరిగిందని, రెండు సార్లు బైపాస్ సర్జరీ జరిగినట్లు తెలిపారు, దీంతో సంపాదనంతా వైద్యానికి ఖర్చైపోయిందని అన్నారు. అంతేకాదు సర్జరీల వలన ఆయన సరిగా మాట్లాడలేకపోతున్నారని.. తమకు సహాయం చేయాల్సిందిగా పరిశ్రమను వేడుకున్నారు.
పుష్ప సావంత్ విజ్ఞప్తి పై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఉద్యోగుల సంఘం స్పందించింది. లీలాధర్ ఫ్యామిలీకి ఆర్ధికంగా అండగా నిలబడానికి ముందుకు వచ్చింది. అమితాబ్ బచ్చన్ , సల్మాన్ ఖాన్ , నిర్మాతల సంఘాల, నటీనటులను లీలాధర్ కుటుంబానికి ఆర్ధిక సాయం చేయమని సంప్రదిస్తామని బిఎన్ తివారీ చెప్పారు. లీలాధర్ సావంత్ షారుఖ్ ఖాన్ హిట్ మూవీ దివానా, అక్షయ్ కుమార్ మై ఖిలాడీ తూ అనారి, మాధురి దీక్షిత్ 100 డేస్ , గోవింద ‘హత్యా’ ల సహా అనేక హిట్ సినిమాలకు ఆయన ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు.
Also Read: ఇంట్లోనే ఈజీగా బోన్ లెస్ చికెన్ తో రెస్టారెంట్ స్టైల్ లో మంచూరియా తయారీ విధానం ఎలా అంటే