Kama Pisachi Video: బ్యాంకులో కామ పిశాచి.. ఆర్ధిక అవసరాల కోసం వచ్చేవారే మేనేజర్ టార్గెట్.. CCTV కెమెరా దృశ్యాల్లో కామాంధుడు

ఆ బ్యాంక్‌ మేనేజర్‌ మామూలోడు కాదు. ఆఫీసర్‌ ముసుగులో ఉన్న కామాంధుడు. మహిళా ఖాతా దారులను వేధించి.. లోబర్చుకునే పర్వర్ట్‌. తాాజాగా ఈ ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది. పొదలకూరు స్టేట్ బ్యాంక్ మేనేజర్ నగేష్ గురించే..

Kama Pisachi Video: బ్యాంకులో కామ పిశాచి.. ఆర్ధిక అవసరాల కోసం వచ్చేవారే మేనేజర్ టార్గెట్.. CCTV కెమెరా దృశ్యాల్లో కామాంధుడు
Podalakur State Bank Manage
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 03, 2021 | 12:59 PM

కామాంధులు..! ఇక్కడ ఉంటారు .. ఒక్కడ ఉండరూ అని లేదు..! అంతటా ఉంటున్నారు. మహిళలు కనిపిస్తే చాలు కామ పిశాచాల్లా మీద పడుతున్నారు. అవసరం మీదైతే.. నువ్వు నాకు అది ఇస్తే.. నేను నీకు ఇది ఇస్తా.. అనే బాపతుగాళ్లు అన్ని చోట్ల కనిపిస్తున్నారు. తాజాగా అలాంటి లోఫర్‌గాడు ఓ బ్యాంకులో దొరికిపోయాడు. ఆర్ధిక  అవసరం కోసం బ్యాంకుకు వచ్చే మహిళలను టార్గెట్  చేసుకుంటున్నాడు. వారి పట్ల అసభ్యంగా ప్రవర్థిస్తుండగా అడ్డంగా దొరికి పోయాడు.

ఆ బ్యాంక్‌ మేనేజర్‌ మామూలోడు కాదు. ఆఫీసర్‌ ముసుగులో ఉన్న కామాంధుడు. మహిళా ఖాతా దారులను వేధించి.. లోబర్చుకునే పర్వర్ట్‌. తాాజాగా ఈ ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది. పొదలకూరు స్టేట్ బ్యాంక్ మేనేజర్ నగేష్. ఈయనగారి అసభ్య ప్రవర్తనతో ఎంతోమంది మహిళలు విసిగిపోయారు. బ్యాంక్‌కు వచ్చి లోన్‌ అడగాలన్నా.. తమ లోన్‌ను ఓకే చేయించుకోవాలన్నా.. మేనేజర్‌గారి దగ్గరకు ఒంటరిగా రావాల్సిందే.

వచ్చాక ఆయన ఏం చేస్తాడో.. బ్యాంక్‌లోని సీసీటీవీ కెమెరాకే తెలియాలి. మహిళా ఖాతాదారులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ పట్టుబడ్డాడు మేనేజర్‌ నగేష్‌. రుణాల కోసం వచ్చే వారిని పిలిపించుకుని మాట్లాడడం.. ఆ సమయంలో వారితో పిచ్చిగా ప్రవర్తిస్తూ వేధించడం అలవాటుగా మారింది. కొంతమంది తమ పరువుపోతుందని బయటకు చెప్పుకోలేక.. మిన్నకుండిపోతున్నారు. అయితే సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాలు బయటకు రావడంతో.. నగేష్‌ బండారం బయటపడింది.

సీసీటీవీ కెమెరాలోని దృశ్యాలు మీడియా ఛానల్స్‌లో రావడంతో తేలుకుట్టిన దొంగల బ్యాంక్ నుంచి జారుకున్నాడు. వీడియో ఆధారంగా కేసులు పెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పరారీలో ఉన్న కామాంధుడు నగేష్‌ను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: SBI customers ALERT!: SBI ఖాతాదారులకు అలర్ట్.. ఆదివారం ఈ సేవలకు అంతరాయం

India Corona Updates: తగ్గుతున్న కోవిడ్ ఉద్ధృతి.. కొత్తగా 44,111 కేసులు..738 మరణాలు

Darbhanga blast case: తండ్రి యోదుడు.. కొడుకులు మాత్రం కసాయిలు.. ఎందుకిలా..?