India Corona Updates: తగ్గుతున్న కోవిడ్ ఉద్ధృతి.. కొత్తగా 44,111 కేసులు..738 మరణాలు
దేశంలో కోవిడ్ కేసుల ఉద్ధృతి రోజు రోజుకు అదుపులోకి వస్తోంది. మరణాల సంఖ్య మాత్రం కొద్దిగా పెరిగింది. గడచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా..
దేశంలో కోవిడ్ కేసుల ఉద్ధృతి రోజు రోజుకు అదుపులోకి వస్తోంది. మరణాల సంఖ్య మాత్రం కొద్దిగా పెరిగింది. గడచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 44,111 మంది కరోనా బారినపడ్డారు. శుక్రవారం ఒక్కరోజే 57,477 మంది కోలకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,05,02,362కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.
కాగా, ఇదే సమయంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా భారీగా తగ్గింది. గడచిన 24 గంటల వ్యవధిలో 738 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,01,050 కు చేరింది. దేశంలో ప్రస్తుతం కరోనాకు చికిత్స పొందుతున్న వారిసంఖ్య 5లక్షలకు దిగువకు చేరింది. మరోపక్క నిన్న 43,99,298 మంది టీకాలు వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 34,46,11,291 కి చేరింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి.