AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Mask : కరోనా కట్టడి కోసం ఏకంగా 3లేయర్లతో బంగారు మాస్కునే చేయించుకున్న గోల్డెన్ బాబా.. మాస్క్ ధర ఎంతంటే

Gold Mask : ప్రపంచ వ్యాప్తంగా ప్రతి మనిషి జీవితం కరోనా కు ముందు... తర్వాత అన్న చందంగా మారిపోయింది. ఓ వైపీ వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతున్నా..కరోనా నియంత్రణ కోసం కోవిడ్ నిబంధనలు...

Gold Mask : కరోనా కట్టడి కోసం ఏకంగా 3లేయర్లతో బంగారు మాస్కునే చేయించుకున్న గోల్డెన్ బాబా.. మాస్క్ ధర ఎంతంటే
Golden Baba
Surya Kala
|

Updated on: Jul 03, 2021 | 9:50 AM

Share

Gold Mask : ప్రపంచ వ్యాప్తంగా ప్రతి మనిషి జీవితం కరోనా కు ముందు… తర్వాత అన్న చందంగా మారిపోయింది. ఓ వైపీ వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతున్నా..కరోనా నియంత్రణ కోసం కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే నని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సహా అందరూ హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత మాస్క్ ప్రతి ఒక్కరూ ధరిస్తున్నారు కానీ.. ఈ మాస్క్ ను అంతకు ముందు కూడా ఆసియా దేశాలైన, చైనా, జపాన్, దక్షిణ కొరియా లోని పలువురు మాస్క్ ను ధరించేవారు. అయితే కరోనా నేపథ్యంలో కట్టడికి మాస్క్ ధరించడం తప్పనిసరి.. దీంతో మాస్క్ మ‌నిషి జీవితంలో ఓ భాగ‌మైపోయింది.

బ‌య‌ట‌కు వెళ్తే మాస్కు త‌ప్ప‌నిస‌రి. మాస్క్‌ లేనిదే మ‌నుగ‌డ‌లేదు. ఆ మాస్క్‌ల‌లో స‌ర్జిక‌ల్ మాస్క్‌, ఎన్‌ 95 మాస్క్‌, క్లాత్ మాస్క్‌, డబుల్ మాస్క్‌..ఇలా అనేక రకాల మాస్కులు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో మాస్కులపై ఎంబ్రాయిడరీ, పెయింటింగ్ వంటివి వేసి అమ్మకానికి పెడుతున్నారు. అయితే ఓ వ్యక్తి.. మాస్క్ ను ఏకంగా బంగారం తో చేయించుకుని వార్తల్లో నిలిచాడు. వివరాల్లోకి వెళ్తే..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన మ‌నోజ్ సెంగార్ అనే వ్యక్తి మాస్క్‌ను బంగారంతో చేయించుకున్నారు. గోల్డెన్ బాబాగా పేరుగాంచిన మ‌నోజానంద మ‌హారాజ్ బంగారంతో చేయించిన మాస్క్ ను ధరించి చక్కర్లు కొడుతూ వార్తల్లో నిలిచాడు. ఈ మాస్క్ ధర అక్షరాలా ఐదు లక్షలు. తన బంగారు మాస్క్ పై స్పందించిన గోల్డెన్ బాబా దేశవ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ విజృంభ‌ణ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు మాస్క్ లను సరిగ్గా ఉపయోగించడం లేదని అన్నారు. అయితే తాను చేరించుకున్న బంగారం మాస్క్ లో ట్రిపుల్ కోటింగ్ ఉంద‌ని చెప్పారు. అంతేకాదు.. ఈ మాస్క్ ను పూర్తిగా శానిటైజ్ చేసినట్లు తెలిపారు. అంతేకాదు.. తన బంగారం మాస్క్ మూడేళ్ళ పాటు పనిచేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు గోల్డెన్ బాబా

Also Read: ఇంత వరకూ ప్రభుత్వం నుంచి ఏ పద్మలు అందుకోని విశ్వనటచక్రవర్తి ఎస్వీ రంగారావు జయంతి నేడు.. రేర్ పిక్స్ మీ కోసం  

Follow Us
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి