Delta Variant: మరింత దడ పుట్టిస్తున్న డెల్టా వేరియంట్.. ఆ దేశంలో రికార్డు స్థాయిలో మరణాలు
Delta Variant: ఒక వైపు కరోనాతో ఇబ్బందులకు గురవుతుంటే.. దాని వేరియంట్లతో మరింత ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గత ఏడాదికిగా ఇబ్బందులు పెడుతున్న..
Delta Variant: ఒక వైపు కరోనాతో ఇబ్బందులకు గురవుతుంటే.. దాని వేరియంట్లతో మరింత ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గత ఏడాదికిగా ఇబ్బందులు పెడుతున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్, వ్యాక్సినేషన్ ప్రక్రియలు కొనసాగుతుంటే..తాజాగా కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగా డెల్టా వేరియంట్ మరింత భయాందోళన కలిగిస్తోంది. రష్యా దేశంలో మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. వరుసగా నాలుగవ రోజు ఆ దేశంలో అత్యధిక మరణాలు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 679 మంది వైరస్‌తో చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు.
రష్యాలో కరోనాతో అత్యధిక మరణాలు సంభవించిన అయిదో దేశంగా నిలిచింది. డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి దేశ ప్రజలను వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో శుక్రవారం అత్యధికంగా 101 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య అధికంగా ఉన్నా.. యూరో కప్‌లో భాగంగా స్పెయిన్ వర్సెస్ స్విట్జర్లాండ్ మ్యాచ్‌ను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్లను మాత్రమే మాస్కో రెస్టారెంట్లకు అనుమతి ఇస్తున్నారు. సెప్టెంబర్ నాటికి 60 శాతం ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వాలని రష్యా నిర్ణయించుకుంది. కరోనా వైరస్ వల్ల ఇప్పటి వరకు రష్యాలో 1,36,565 మంది మృతిచెందారు.