ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో యాక్షన్ మొదలు పెట్టిన మావోయిస్టులు.. ఐర‌న్ ఓర్ ప్లాంట్‌ కార్మికుల‌ కిడ్నాప్

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో యాక్షన్ మొదలు పెట్టిన మావోయిస్టులు.. ఐర‌న్ ఓర్ ప్లాంట్‌ కార్మికుల‌ కిడ్నాప్
Some Armed Maoists Attacked

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మావోయిస్టులు విరుచుకు పడ్డారు. ఇంతకాలం కోవిడ్‌తో వ్యాప్తితో మౌనంగా ఉంటున్న మావోయిస్టులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. నారాయ‌ణ‌పూర్ జిల్లా చోటే డోంగార్..

Sanjay Kasula

| Edited By: Balaraju Goud

Jul 03, 2021 | 6:48 PM

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మావోయిస్టులు విరుచుకు పడ్డారు. ఇంతకాలం కోవిడ్‌తో వ్యాప్తితో మౌనంగా ఉంటున్న మావోయిస్టులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. నారాయ‌ణ‌పూర్ జిల్లా చోటే డోంగార్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో అల‌జ‌డి సృష్టించారు. నారాయణపూర్‌కు సమీపంలోని ఆందారి ఐర‌న్ ఓర్ ప్లాంట్‌లోని యంత్రాలను ధ్వంసం చేశారు. ప్రొక్లెయిన్ స‌హా ఆరు వాహ‌నాల‌కు మావోయిస్టులు నిప్పు పెట్టారు. ఆయంత్రాలు పూర్తిగా కాలిపోయే వరకు అక్కడే ఉన్న దళం సభ్యులు… అనంత‌రం సూప‌ర్ వైజ‌ర్ స‌హా ప‌లువురు కార్మికుల‌ను బందీలుగా ఎత్తుకు పోయారు.

ఈ ఘటన జరిగిన విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. కూలీలను విడిచి పెట్టాలని పోలీసులు కోరినా… వినకుండా పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ క్ర‌మంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య భారీ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌ను నారాయ‌ణ‌పూర్ ఎస్పీ మోహిత్ గార్గ్ ధృవీక‌రించారు.

ఇవి కూడా చదవండి : Gandhi Bhavan: గాంధీభవన్‌ను వదలని వాస్తుదోషం.. భారీగా మార్పులు మొదలు పెట్టిన కొత్త చీఫ్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu