Gandhi Bhavan: గాంధీభవన్‌ను వదలని వాస్తుదోషం.. భారీగా మార్పులు మొదలు పెట్టిన కొత్త చీఫ్
గాంధీభవన్‌లో వాస్తుదోషం ఉందా..? అందుకే పీసీసీ అధ్యక్షులు సఫలం కాలేకపోతున్నారా..? పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే.. ఏం చేయాలి? కొత్త పీసీసీ అధ్యక్షుడు గాంధీభవన్‌లో...
గాంధీభవన్‌లో వాస్తుదోషం ఉందా..? అందుకే పీసీసీ అధ్యక్షులు సఫలం కాలేకపోతున్నారా..? పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే.. ఏం చేయాలి? కొత్త పీసీసీ అధ్యక్షుడు గాంధీభవన్‌లో చేస్తున్న మార్పులేంటి..? తెలంగాణ వచ్చాక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. క్షేత్రస్థాయిలో పార్టీ పట్టుకోల్పోతోంది. గెలిచిన ఒక్కో ఎమ్మెల్యే జారిపోతుండడంతో.. పీసీసీ పెద్దలు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో పడిపోయారు. దాదాపు ఆరేళ్ల తర్వాత పీసీసీ పగ్గాలు చేతులు మారాయి. తెలంగాణ పీసీసీ బాధ్యతలను రేవంత్ రెడ్డి అందిపుచ్చుకున్న తర్వాత గాంధీభవన్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పనిలో పనిగా.. గాంధీభవన్ వాస్తులోనూ మార్పులు చేస్తున్నారు. వాస్తు నిపుణుల సూచనల ఆధారంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత పాలకుల సంప్రదాయాలను బద్దలు కొడుతున్నారు.
ప్రస్తుతం గాంధీభవన్ ఎంట్రన్స్ దక్షిణం వైపు ఉంది.. ఇక మీదట తూర్పుద్వారం నుంచి ఎంటర్ అవుతారు. దక్షిణ ద్వారం నుంచి ఎగ్జిట్ అయ్యేలా మార్పులు చేశారు. అంతేకాదు.. గాంధీభవన్ ముందు ఎక్కువ స్పేస్ ఉండేలా చూస్తున్నారు. ఇక పీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ల చాంబర్‌లు కూడా మారబోతున్నాయి. పీసీసీ అధ్యక్షుడి చాంబర్ తూర్పువైపు తీసుకురాబోతున్నారు.
గాంధీభవన్ రూపురేఖలు మారుతాయన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి చమల కిరణ్ రెడ్డి. వాస్తులోపాలు లేకుండా చూస్తున్నామని.. దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయన్నారు.