Ayurveda-Lasora Fruits: రోడ్ల పక్కన ముళ్ళ పొదల్లో కనిపించే ఈ కాయలు దీర్ధకాలిక రోగాలకు దివ్య ఔషధం

Ayurveda-Lasora Fruits: పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు అనేది సామెత.. భారత దేశంలో అతి పురాతన వైద్యం ఆయుర్వేదం.. ఈ వైద్య విధానంలో ఎక్కువగా ప్రకృతి నుంచి లభించే చెట్లు..

Ayurveda-Lasora Fruits: రోడ్ల పక్కన ముళ్ళ పొదల్లో కనిపించే ఈ కాయలు దీర్ధకాలిక రోగాలకు దివ్య ఔషధం
Lasora Fruit
Follow us
Surya Kala

|

Updated on: Jul 02, 2021 | 5:39 PM

Ayurveda-Lasora Fruits: పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు అనేది సామెత.. భారత దేశంలో అతి పురాతన వైద్యం ఆయుర్వేదం.. ఈ వైద్య విధానంలో ఎక్కువగా ప్రకృతి నుంచి లభించే చెట్లు.. ఆకులు కాయలు వంటివే ఔషదాలుగా ఉపయోగిస్తారు.. అలాంటి ఔషధ గుణాలు కలిగిన ఓ చెట్టు విరిగి చెట్టు.. వీటి కాయలను విరిగి కాయలు చెట్టు, నక్కెర, బంక నక్కెర, బంక కాయలు, బంక కాయలు చెట్టు నెక్కర కాయలు అని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకం పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ విరిగి చెట్లు పల్లెటూర్లలో పట్టణాలలో అక్కడక్కడా కనిపిస్తూ ఉంటాయి. ఈ చెట్టుకు గుత్తులు గుత్తులుగా చాలా కాయలు కనిపిస్తూ ఉంటాయి. ఈ కాయల వలన కలిగే ఆరోగ్య ఫలితాలు ఎన్నో..

*ఈ నక్కెర పండ్లు తినడం మూలంగా డయాబెటిస్ కూడా అదుపులోకి వస్తుందని పరిశోధనలలో రుజువైంది. ఈ పండ్లు తినడం మూలంగా రక్తంలోని గ్లూకోజ్ స్థాయి కంట్రోల్ అవుతుంది. *మలబద్ధకం అజీర్తి గ్యాస్ సంబంధిత సమస్యలతో బాధపడేవారు రోజుకు ఐదారు పండ్లు తింటూ ఉంటె సుఖ విరోచనం అవుతుంది. *ఈ చెట్టు బెరడు ఆయుర్వేద మందులలో ఉపయోగిస్తారు. చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఈ చెట్టు బెరడును ఎండబెట్టి పొడిచేసి ఆ పొడిని మెత్తటి పేస్ట్ లా చేసుకొని చర్మ సంబంధిత సమస్యల పైన అప్లై చేస్తూ ఉంటే త్వరగా తగ్గుతుంది. *ఈ చెట్టు యొక్క బెరడు తో మహిళలు కనుక కషాయం చేసుకుని తాగితూఉంటే రుతు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. *ఈ కషాయం తో గాయాలను పుండ్లను శుభ్రం చేసుకుంటే ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండి త్వరగా నయమవుతాయి. *పురుషుల్లో వీర్యకణాలు తక్కువగా వున్నవారు ఈ పండ్లు తింటే వీర్యకణాల వృద్ధి జరుగుతుంది. *ఈ పండ్లు ఈ సీజన్ పండ్లు కనుక వీటిని సేకరించి .. నీడలో ఆరబెట్టి.. చూర్ణం చేసుకుని భద్రపరచుకుంటారు. కొన్ని గిరిజన ప్రాంతాల్లో లో ఈ లసొడ పండ్లను ఎండబెట్టి మైదా శెనగపిండి నెయ్యితో కలిపి లడ్డూలు లాగా తయారు చేస్తారు. లడ్డూలను తినడం వల్ల శరీరానికి బలం శక్తి లభిస్తుందని ఎన్నో ఏళ్లుగా గిరిజనుల నమ్మకం.

వీటి పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా ఉంటాయి. పండు మగ్గిన తర్వాత లేత ఎరుపు రంగులో ఉంటాయి. వీటి కాయ లోపల బంక లాగా ఒక తీపి పదార్థం ఉంటుంది. అందుకే కొన్ని ప్రాంతాలలో దీనిని బంక కాయలు చెట్టు అని కూడా పిలుస్తారు. తియ్యగా ఉండే ఈ చెట్ల పండ్లను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే ఈ పండ్లు అరగడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి తక్కువగానే తినాలి.. ముఖ్యంగా పండ్లు బాగా పండిన అనంతరం తినాలి

Also Read: హీరోయిన్ నిర్మిస్తున్న సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న రాక్‌స్టార్ దేవీశ్రీ అంటూ టాక్..