Charmi-Devi Sri Prasad: హీరోయిన్ నిర్మిస్తున్న సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న రాక్‌స్టార్ దేవీశ్రీ అంటూ టాక్..

Charmi-Devi Sri Prasad: టాలీవుడ్‌ రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ హీరోగా నిర్మాత,నటి చార్మి ఓ సినిమా నిర్మించేందుకు రెడీ అవుతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి..

Charmi-Devi Sri Prasad: హీరోయిన్ నిర్మిస్తున్న సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న రాక్‌స్టార్ దేవీశ్రీ అంటూ టాక్..
Devi Sri Charmi
Follow us
Surya Kala

|

Updated on: Jul 02, 2021 | 4:52 PM

Charmi-Devi Sri Prasad: టాలీవుడ్‌ రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ హీరోగా నిర్మాత,నటి చార్మి ఓ సినిమా నిర్మించేందుకు రెడీ అవుతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి క్రేజ్ ఉన్న దేవీశ్రీ..అప్పుడప్పుడు స్క్రీన్ మీద చాలా హుషారుగా సందడి చేస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో నెం. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఉన్న దేవిశ్రీ తన హవాను అదే రేంజ్‌లో కొనసాగిస్తున్నారు. కరోనా కారణంగా సినిమాల సంఖ్య తగ్గినప్పటికీ.. దేవిశ్రీ ప్రసాద్‌ చేతిలో మాత్రం ఏకంగా అరడజను సినిమాలు వరకు ఉన్నాయి. అందులో పుష్ప లాంటి పాన్‌ఇండియా మూవీ ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు.

ఇదిలావుంటే మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఫుల్‌ బిజీగా ఉన్న దేవిశ్రీ ప్రసాద్‌.. ఇప్పుడు హీరోగా మారే టైమ్‌ వచ్చేసిందని టాక్‌ వినిపిస్తోంది. అందుకే గతంలో ఈయన హీరోగా సినిమా రాబోతుందని వార్తలు వచ్చాయి. కానీ దాని గురించి మళ్లీ ఎక్కడా ప్రస్తావన రాలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ వార్త ఫిల్మ్‌ సర్కిల్స్‌లో షికారు చేస్తోంది. ‘జ్యోతిలక్ష్మి’ సినిమా తర్వాత నిర్మాతగా మారిన చార్మి స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్ మేకర్స్ కరణ్ భాగస్వామ్యంతో పూరి – చార్మి విజయ్ దేవరకొండతో ‘లైగర్’ అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నారు. 120 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియన్ సినిమాగా రూపొందిస్తున్న ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ క్రమంలోనే దేవీశ్రీప్రసాద్ హీరోగా చార్మి ఓ సినిమా నిర్మించే ఆలోచనలో ఉన్నారట. ఓ హర్రర్‌ థ్రిల్లర్‌ కోసం చార్మి దేవిశ్రీ ప్రసాద్‌ ను సంప్రదించారని.. ఆ కథ విని అతను కూడా హీరోగా నటించడానికి ఓకే చెప్పారని తెలుస్తోంది. అయితే సినిమా గురించి ఛార్మీ గానీ, దేవి శ్రీ ప్రసాద్ గానీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Also Read: వ్యాక్సిన్ కోసం నిబంధలు వదిలి జనం తొక్కిసలాట.. ఇలాఐతే ఎన్ని వేవులైన వస్తాయంటూ ఆందోళన