Vaccine Centres in MP: వ్యాక్సిన్ కోసం నిబంధలు వదిలి జనం తొక్కిసలాట.. ఇలాఐతే ఎన్ని వేవులైన వస్తాయంటూ ఆందోళన
Vaccine Centres in MP: కరోనా కట్టడి కోసం నిబంధనలు మాస్క్ ధరించడం.. చేతులను తరచుగా శానిటైజ్ చేసుకోవడం.. భౌతిక దూరం పాటించడం.. వీటితో పాటు వ్యాక్సిన్ తీసుకోవడం.. అయితే కరోనా రాకుండా..
Vaccine Centres in MP: కరోనా కట్టడి కోసం నిబంధనలు మాస్క్ ధరించడం.. చేతులను తరచుగా శానిటైజ్ చేసుకోవడం.. భౌతిక దూరం పాటించడం.. వీటితో పాటు వ్యాక్సిన్ తీసుకోవడం.. అయితే కరోనా రాకుండా తీసుకొనే టీకా కోసం ప్రజలు కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు అందానికి ఉదాహరణగా నిలిచింది. ఓ సంఘటన. అవును టీకా వేసే సెంటర్ లో ఏదో స్టార్ హీరో సినిమా విడుదలైతే.. థియేటర్ల వద్ద టిక్కెట్ల కోసం జరుగుతున్న తొక్కిసలాటలా కనిపిస్తుంది. అలా అనుకుంటే మీరు కూడా పొరపాటు పడ్డట్టే. ఇక్కడి జనాలు ఒకరినొకరు తోసుకుంటూ ఇంతలా పరుగులు పెట్టేది సినిమా టిక్కెట్ కోసం కాదు. వ్యాక్సిన్ కోసం.అవును వారంతా మహమ్మారి పంజా నుంచి రక్షణ పొందేందుకు వ్యాక్సిన్ వేయించుకోడానికి ఇలా తండోపతండాలుగా తరలివచ్చారు.
మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక సాసర్ మండలంలోని లోధిఖేడ గ్రామంలో దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చింది. వందల మంది జనాలు ఒకరినొకరు నెట్టుకుంటూ.. టీకా కోసం పరుగులు పెట్టారు. వ్యాక్సినేషన్ సెంటర్‌లో వ్యాక్సిన్ నిల్వలు అందుబాటులోకి వచ్చాయనే సమాచారం తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా ఇలా గుంపులగుంపులుగా తరలివచ్చారు. ఒకేసారి వందలాది మంది అక్కడకు చేరుకోవడమే కాకుండా, వ్యాక్సిన్ కోసం పోటీ పడడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన వారు ప్రజలు ఇలా బాధ్యతారాహిత్యంగా ఉంటె.. సెకండ్ వేవ్ , థర్డ్ వేవ్ కాదు.. ఎన్ని వేవులైనా వస్తాయని వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read: ఎవరు మీలో కోటీశ్వరులు షో చిత్రీకరణకు రెడీ అవుతున్న యూనిట్.. లుక్ ప్రిపరేషన్ లో ఎన్టీఆర్