Hungama 2 : యంగ్ క‌పుల్‌, సీనియ‌ర్ క‌పుల్ జీవితాల్లో నెలకొన్న గందరగోళం.. ఆకట్టుకుంటున్న ట్రైలర్

బాలీవుడ్ లో సీక్వెల్స్ హంగామా కనిపిస్తుంది. ఓ సినిమా హిట్ అయితే వెంటనే ఆ సినిమాకు సీక్వెల్స్ సిద్ధం చేస్తున్నారు దర్శకులు.

Hungama 2 : యంగ్ క‌పుల్‌, సీనియ‌ర్ క‌పుల్ జీవితాల్లో నెలకొన్న గందరగోళం.. ఆకట్టుకుంటున్న ట్రైలర్
Hungama 2
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 02, 2021 | 3:11 PM

hungama 2: బాలీవుడ్ లో సీక్వెల్స్ హంగామా కనిపిస్తుంది. ఓ సినిమా హిట్ అయితే వెంటనే ఆ సినిమాకు సీక్వెల్స్ సిద్ధం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే ఓ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ప్రియ‌ద‌ర్శ‌న్ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన చిత్రం హంగామా. 2003లో రిలీజై బాక్సాపీస్ వ‌ద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఇపుడు ఇదే జోన‌ర్ లో ప్రియ‌ద‌ర్శ‌న్ డైరెక్ట్ చేస్తున్న సినిమా హంగామా 2. జావేద్ జాఫ్రీ కుమారుడు మీజాన్ జాఫ్రీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రణీత సుభాష్ హీరోయిన్ గా నటిస్తోంది. సౌత్ లో మెప్పించిన ప్రణీత కు ఇది బాలీవుడ్ డెబ్యూ మూవీ. ఇందులో శిల్పా శెట్టి – పరేష్ రావల్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. హంగామాకు సీక్వెల్ కాక‌పోయినా అందులోని మ‌స్తీ, ఫ‌న్, ఎంట‌ర్ టైన్ మెంట్ ను హంగామా 2లో రిపీట్ కాబోతున్నాయి.

ఈ మేరకు చిత్రయూనిట్ హంగామా 2 ట్రైలర్ ను విడుదల చేసారు. ‘హంగామా 2’ ట్రైలర్ ను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి విషెస్ అందజేశాడు. యంగ్ క‌పుల్‌, సీనియ‌ర్ క‌పుల్ జీవితాల్లో ఎలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగాయో ఫ‌న్నీగా,వినోదాత్మ‌కంగా చూపించేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్టు ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. ప్రణీత సుబాష్ బిడ్డకు తండ్రి ఎవరు అనే డిస్కషన్ తో ప్రారంభమవుతుంది. మీజాన్ జాఫ్రీ తన బిడ్డ కాదని అశుతోష్ రానాకు వివరిస్తూ కనిపిస్తాడు. ఇందులో శిల్పా శెట్టి భర్తగా పరేష్ రావల్ నటించాడు. అందమైన తన భార్యకు అందరూ సైట్ వేస్తున్నారని అనుమాన పడే పరేష్… మీజాన్ – శిల్పా క్లోజ్ గా ఉండటం చూసి వారి మధ్య ఎఫైర్ ఉందని అపార్ధం చేసుకుంటారు.. ఈ నేపథ్యంలో అనుమానం – అపార్థాల వల్ల పాత్రల మధ్య ఏర్పడిన గందరగోళం నవ్వు తెప్పిస్తోంది. ఈ ట్రైలర్ పైన మీరు ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Samantha Akkineni: ‘నా జీవితంలో మూడు మార్పులు జరిగాయి… ఇప్పుడు నాపై నాకు నమ్మకం కుదిరింది’.. ఆసక్తికర విషయాలను చెప్పిన సమంత..

Jani Master : హీరోగా జానీ మాస్టర్.. మొదటి సినిమా పూర్తికాకుండానే రెండో మూవీ కూడా