Jani Master : హీరోగా జానీ మాస్టర్.. మొదటి సినిమా పూర్తికాకుండానే రెండో మూవీ కూడా

టాలెంట్ ఉంటే చాలు హీరోలుగా రాణించడం సాధ్యమే.. సినిమా ఇండస్ట్రీలో ఇలా హీరోలుగా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.

Jani Master : హీరోగా జానీ మాస్టర్.. మొదటి సినిమా పూర్తికాకుండానే రెండో మూవీ కూడా
Jani Master
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 02, 2021 | 2:45 PM

Jani Master : టాలెంట్ ఉంటే చాలు హీరోలుగా రాణించడం సాధ్యమే.. సినిమా ఇండస్ట్రీలో ఇలా హీరోలుగా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. విలన్లు , డైరెక్టర్లు, కమెడియన్లు, కొరియోగ్రాఫర్లు ఇలా చాలా మంది హీరోలు గా మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా త్వరలో హీరోగా మారనున్నారు. మురళీరాజ్‌ తియ్యాన అనే నూతన దర్శకుడు తెరక్కేక్కిస్తున్న ఈ సినిమా గత ఏడాది డిసెంబరులో ప్రారంభమైంది. ఈ సినిమా పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మరో సినిమాసినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జానీ మాస్టర్. ఈ సినిమాకు ఓషో తులసీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఓషో తులసీరామ్‌ ‘మంత్ర, మంగళ’ చిత్రాలను తెరకెక్కించారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘దక్షిణ’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు.

ఈ రోజు (జులై 2) జానీ మాస్టర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శకుడు తులసీరామ్ మాట్లాడుతూ..‘‘ఇదొక సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌. అరకు, గోవా ఫారెస్ట్, బెంగళూరు ప్రాంతాల్లో చిత్రీకరణ జరపబోతున్నాం’’ అన్నారు. ఇంతకాలం తన డాన్స్ లతో ప్రేక్షకులను అలరించిన జానీ మాస్టర్ ఇప్పుడు హీరోగా ఎలా ఆకట్టుకోబోతున్నారో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Rajamouli Twitter: ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌పై అసహనం వ్యక్తం చేసిన దర్శకధీరుడు రాజమౌళి.. స్పందించిన యాజమాన్యం.

Major Movie: అంచనాలు పెంచుతున్న అడివి శేష్ సినిమా.. భారీ ధరకు మేజర్ మూవీ హిందీ శాటిలైట్ రైట్స్..

Rajinikanth’s Annaatthe: దీపావళికే సూపర్ స్టార్ సినిమా.. రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్రయూనిట్