Oscar Academy: ఆస్కార్ అకాడ‌మీలో భారతీయ తారలు.. స‌భ్యులుగా విద్యాబాల‌న్‌, ఏక్తా క‌పూర్‌కు చోటు..

Oscar Academy: ఆస్కార్ అకాడ‌మీలో భారతీయ తారలు.. స‌భ్యులుగా విద్యాబాల‌న్‌, ఏక్తా క‌పూర్‌కు చోటు..
Oscar Academy Class Of 2021

Oscar Academy invited: ఆస్కార్ అకాడ‌మీలో భారతీయ తారలకు చోటు దక్కించుకుంది. ప్ర‌తిష్టాత్మ‌క ఆస్కార్ అకాడ‌మీ కొత్త స‌భ్యులతో కూడిన వివ‌రాల‌ను విడుదల చేసింది. ఇందులో బాలీవుడ్ న‌టి విద్యా బాల‌న్‌తో పాటు టీవీ నిర్మాత ఏక్తా కపూర్‌,

Sanjay Kasula

|

Jul 02, 2021 | 3:47 PM

ఆస్కార్ అకాడ‌మీలో భారతీయ తారలకు చోటు దక్కించుకుంది. ప్ర‌తిష్టాత్మ‌క ఆస్కార్ అకాడ‌మీ కొత్త స‌భ్యులతో కూడిన వివ‌రాల‌ను విడుదల చేసింది. ఇందులో బాలీవుడ్ న‌టి విద్యా బాల‌న్‌తో పాటు టీవీ నిర్మాత ఏక్తా కపూర్‌, ఆమె త‌ల్లి శోభా క‌పూర్‌లో ఈ ఏడాది రిలీజ్ చేసిన ఆస్కార్ కొత్త క‌మిటీలో స‌భ్యులుగా ఉన్నారు. మొత్తం 50 దేశాల‌కు చెందిన 395 మంది స‌భ్యుల‌తో జాబితాను ఆస్కార్ అకాడ‌మీ రిలీజ్ చేసింది. ద క్లాస్ ఆఫ్ 2021 పేరుతో రిలీజ్ చేసిన లిస్టులో 46 శాతం మంది మ‌హిళ‌లు ఉన్నారు. మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌హానీ, ఫ్యామిలీ డ్రామా తుమ్‌హ‌రి సులు లాంటి చిత్రాల్లో విద్యాబాల‌న్ న‌టించి ప్ర‌శంస‌లు పొందారు.

పా, బూల్‌బుల‌య్యా, ప‌రిణీత‌, బాబీ జాసూస్‌, శ‌కుంత‌లా దేవి లాంటి చిత్రాల్లోనూ ఆమె న‌టించారు. 2011లో వ‌చ్చిన ద డ‌ర్టీ పిక్చ‌ర్ సినిమాలో ప్ర‌ధాన పాత్ర పోషించిన విద్యాబాల‌న్‌కు జాతీయ ఫిల్మ్ అవార్డు ద‌క్కిన విష‌యం తెలిసిందే.  అయితే ఇప్పుడు ఇందులో చోటు దక్కించుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని విద్యాబాలన్ ప్రకటించారు.

ఇక బాలాజీ టెలి ఫిల్మ్స్‌కు చెందిన ప్రొడ్యూస‌ర్లు ఏక్తా క‌పూర్‌, శోభా క‌పూర్‌లు కూడా ఆస్కార్ అకాడ‌మీలో కొత్త స‌భ్యుల‌య్యారు. డ్రీమ్ గ‌ర్ల్‌, వ‌న్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై, ఉడ్తా పంజాబ్‌, డ‌ర్టీ పిక్చ‌ర్ లాంటి సినిమాల‌కు వీళ్లు నిర్మాత‌లుగా చేశారు.

ఇవి కూడా చదవండి : Drug Racket: నిన్న టెర్రర్ లింక్.. ఇవాళ డ్రగ్స్ మాఫియా.. ఇద్దరు విదేశీ విద్యార్థులు అరెస్ట్

MLA Roja: విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో అన్యాయం చేయొద్దు.. వ్యక్తిగతంగా విమర్శిస్తే మర్యాదగా ఉండదన్న రోజా

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu