Yami Gautham: హీరోయిన్ యామీ గౌతమ్‌కు షాకిచ్చిన ఈడీ.. మనీలాండరింగ్ ఆరోపణలతో నోటీసులు.. స్టేట్మెంట్ ఇవ్వాలని..
Yami Gautham: బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్‌కు ఈడీ షాకిచ్చింది. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘించినట్లు ఈడీ ఆరోపణలు నమోదు చేసింది.
Yami Gautham: బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్‌కు ఈడీ షాకిచ్చింది. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘించినట్లు ఈడీ ఆరోపణలు నమోదు చేసింది. దీంతో మనీలాండరింగ్ ఆరోపణల కింద ఈడీ ఆమెకు గురువారం సమన్లు జారీ చేసింది. ఆర్థిక అవకతవలకలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వచ్చేవారం ఈడీ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఇప్పటికే యామీ గౌతమ్ ఈడీ నుంచి సమన్లు అందుకోగా.. ఇది రెండవసారి.. ఇదిలా ఉంటే.. ఇటీవల కరోనా విపత్కర సమయంలో కుటుంబసభ్యులు.. అతి తక్కువ మంది స్నేహితుల ముందు చిత్ర నిర్మాత ఆదిత్యా ధార్‌ను వివాహం చేసుకుంది యామీ గౌతమ్. విక్కీ డోనర్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యామీ.. హృతిక్ రోషన్ సరసన కాబిల్, వరుణ్ ధావన్ నటించిన బద్లాపూర్ సహా పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇటు సినిమాల్లో మాత్రమే కాకుండా.. పలు బ్యూటీ ప్రొడక్ట్స్‌కు యామీ గౌతమ్ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఓ థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది.
ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా యామీ గౌతమ్ సుపరిచితురాలు. టాలీవుడ్ లో నువ్విలా, గౌరవం, కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈడీ.. బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాలపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. మనీలాండరింగ్ ఆరోపణలతో ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటీనటులను, ఇతర ప్రముఖులను ఈడీ విచారించినట్లుగా సమాచారం.