AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assam Rifles Recruitment: క్రీడానేపథ్యం ఉండి టెన్త్ పాసైన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అస్సోం రైఫిల్స్ నోటిఫికేషన్

Assam Rifles Recruitment: ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎవరికైనా ఆసక్తినే.. ఈ నేపథ్యంలో పదవ తరగతి చదివి ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మంచి వేతనంతో కూడిన కేంద్ర ప్రభుత్వ..

Assam Rifles Recruitment: క్రీడానేపథ్యం ఉండి టెన్త్ పాసైన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అస్సోం రైఫిల్స్  నోటిఫికేషన్
Assam Rifles
Surya Kala
|

Updated on: Jul 02, 2021 | 3:44 PM

Share

Assam Rifles Recruitment: ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎవరికైనా ఆసక్తినే.. ఈ నేపథ్యంలో పదవ తరగతి చదివి ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మంచి వేతనంతో కూడిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి స్త్రీ పురుషుల నుంచి దరఖాస్తులను అహానిస్తున్నారు. నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది అస్సోం రైఫిల్స్ సంస్థ. రైఫిల్ మ్యాన్, రైఫిల్ ఉమెన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 131 ఉద్యోగ ఖాళీలలో పురుషులకు 75 ఉద్యోగ ఖాళీలు, స్త్రీలకు 56 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. డైరెక్టరేట్ జనరల్ అస్సోం రైఫిల్స్ ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నియామక ప్రక్రియను చేపట్టింది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని అనుకునే ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు https://assamrifles.gov.in/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఇదే వెబ్ సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి అభ్యర్థులు దరఖాస్తు పంపించడానికి జులై 25వ తేదీ ఆఖరు తేదీ.

ఈ ఉద్యోగానికి అర్హత ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు 2021 ఆగష్టు 1వ తేదీ నాటికి 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయసు నిబంధనలో సడలింపు ఇచ్చారు. ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు18 నుంచి 33 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారై ఉండాలి.

అప్లికేషన్ దరఖాస్తు కోసం జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 100 చెల్లించాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు.

గేమ్స్ ఫర్ స్కూల్స్ నేషనల్ అవార్డ్ విజేతలతో పాటు అంతర్జాతీయ, జాతీయ, అంతర విశ్వవిద్యాలయ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం :

క్యాండిడేట్ వెరిఫికేషన్, డాక్యుమెంటేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, మెరిట్ లిస్ట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

Also Read: బుల్లి తెరపై నితిన్ ‘రంగ్ దే’ సూపర్ హిట్ హిట్.. మంచి రేటింగ్ సొంతం చేసుకున్న యంగ్ హీరో మూవీ