Rang De TRP Rating:బుల్లి తెరపై నితిన్ ‘రంగ్ దే’ సూపర్ హిట్ హిట్.. మంచి రేటింగ్ సొంతం చేసుకున్న యంగ్ హీరో మూవీ

Surya Kala

Surya Kala |

Updated on: Jul 02, 2021 | 3:11 PM

Rang De TRP Rating: కరోనా మొదటి వేవ్ లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ లో మొదటి సినిమా చెక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో నితిన్ అంతేకాదు లాక్ డౌన్ తర్వాత..

Rang De TRP Rating:బుల్లి తెరపై నితిన్ 'రంగ్ దే' సూపర్ హిట్ హిట్.. మంచి రేటింగ్ సొంతం చేసుకున్న యంగ్ హీరో మూవీ
Rang De Movi E

Follow us on

Rang De TRP Rating: కరోనా మొదటి వేవ్ లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ లో మొదటి సినిమా చెక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో నితిన్ అంతేకాదు లాక్ డౌన్ తర్వాత వరసగా రెండు సినిమాలను చెక్, రంగ్ దే చిత్రాలు నెల రోజుల వ్యవధిలో రిలీజ్ చేసిన హీరో నితిన్. అయితే చెక్ సినిమా ప్రేక్షకులను థియేటర్స్ వద్దకు రప్పించడం లో విఫలమవ్వగా నితిన్ కీర్తి సురేష్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ రంగ్ దే మంచి అంచనాల నడుమ విడుదలై ఓకే అనిపించుకుంది. ఈ సినిమా 2020 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలైంది. రంగ్ దే శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను జీ నెట్వర్క్ (జీ తెలుగు అండ్ జీ 5) దక్కించుకుంది.

ఈ ఏడాది జూన్ 20న రంగ్ దే చిత్రం జీ ఛానల్ లో ప్రీమియర్ అయింది. మొదటి ప్రీమియర్ లో ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు 7.22 టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంది. దీంతో సిల్వర్ స్క్రీన్ పై ఆకట్టుకోని రంగ్ దే బుల్లి తెర ప్రేక్షుకులను ఆకట్టుకుంది. అయితే గతంలో భీష్మ సినిమాను జెమినీ ఛానెల్‌లో ప్రసారం చేస్తే 6.65 రేటింగ్ మాత్రమే వచ్చింది. నిజానికి ఈ సినిమాలు టీవీలో ప్రసారం చేయడానికి ముందే జీ5 యాప్‌లో స్ట్రీమింగ్ కు పెట్టారు. కాగా బ్లాక్ బస్టర్ అయిన ‘భీష్మ’ సినిమా కంటే యావరేజ్‌గా ఆడిన ‘రంగ్ దే’ సినిమాకే టీవీలో ఎక్కువ మార్కులు పడడం ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించగా. దేవిశ్రీ సంగీతం అందించారు.

అయితే ఇలాంటి ఫీట్ ను గతంలో మహేష్ బాబు ఖలేజా, పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ వంటి సినిమాలు గతంలో సొంతం చేసుకున్నాయి. వెండి తెరపై రిజల్ట్ తో సంబంధం లేకుండా బుల్లి తెరపై ఎన్ని సార్లు ప్రసారం చేసినా మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటూనే ఉన్నాయి.

Also Read:  జపాన్‌లో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు.. ఒలంపిక్స్ నిర్వాహకుల్లో ఆందోళన

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu