Anchor Ravi :అందాల ఆశురెడ్డిని ట్రోల్ చేసిన యాంకర్ రవి.. నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో..

టెలివిజన్ లో స్టార్ యాంకర్ గా రాణిస్తున్నాడు రవి. టీవీషోలతోనే కాదు సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్ గా ఉంటాడు.

Anchor Ravi :అందాల ఆశురెడ్డిని ట్రోల్ చేసిన యాంకర్ రవి.. నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో..
Ravi
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 02, 2021 | 4:26 PM

Anchor Ravi:

టెలివిజన్ లో స్టార్ యాంకర్ గా రాణిస్తున్నాడు రవి. టీవీషోలతోనే కాదు సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్ గా ఉంటాడు. తన తోటి యాంకర్ లతో రవి చాలా సరదాగా ఉంటాడు. వారి పైన సెటైర్లు వేస్తూ ..నవ్విస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే యాంకర్ ఆశు రెడ్డి పైన కూడా సెటైర్లు వేస్తూ ఏడిపిస్తూ ఉంటాడు.  తాజాగా ఆశు రెడ్డి ని ఏడిపిస్తూ తన ఇన్‌స్టాలో ఓ వీడియోను కూడా పోస్ట్ చేసాడు రవి. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైలర్ అవుతుంది. చెబ్బీ చెబ్బీగా.. రెడ్‌ కలర్‌ మినీ గౌన్‌లో.. హాట్‌ హాట్‌గా ఆశురెడ్డి నడిచొచ్చే వీడియోకు.. ఓ వాయిస్‌ ఓవర్‌ను యాడ్‌ చేసాడు యాంకర్‌ రవి. అలా చేయడమే కాదు ఎట్ ఏ టైమ్‌ నెట్టింట.. ఇటు వైరల్ అటు ట్రోల్‌ అయ్యేలా చేసాడు. “హైదరాబాద్ వనస్తలి పురంలో పార్కులోకి వచ్చిన ఓ అడవి పంది కాసేపు అందర్నీ బయటపెట్టింది. పార్కులో అడవి పంది సుమారు నాలుగు గంటల పాటు దొరక్కండా తిరిగింది.” అని ఓ న్యూస్‌ యాంకర్‌ చదివిన ఆడియోను ఆషు హాట్ వీడియోకు యాడ్ చేశారు రవి. ఇక అంతే ఆ ఆడియో విత్ ఆషు వీడియో కలిపి చూసి… నవ్వు ఆపుకోలేని ఈ స్టార్‌ యాంకర్‌.. “ఐ యామ్‌ సారీ ఆషూ ” అంటూనే తన క్రియేటివిటీని అందరికీ చూపించేశారు.

అయితే మనోడి క్రియేటివిటీని స్పోటివ్‌గా తీసుకున్న బబ్లీ గార్ల్‌ ఆషు.. “నువు కూడా నాకు తొందర్లో దొరుకుతావ్‌ రవి”..అని వార్నింగ్ ఇస్తూనే… బట్‌ నవ్వకుండా ఉండలేక పోతున్నా” అంటూ… రిప్లై ఇచ్చారు. అయితే ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో చూసిన రవి ఫాలోవర్‌… “నువ్వు కేక అన్న” “వాటే పోలిక” అని అంటుండగా… ఆషు రెడ్డి ఫాలోవర్స్‌ మాత్రం తెగ ఫీల్ అవుతున్నారు. “జూనియర్‌ సామ్‌లా.. బ్యూటీకే బ్రాడ్‌ గా ఉన్న మా ఆషు రెడ్డి అలా ఎలా కమెంట్‌ చేస్తావ్‌ రవి అంటూ.. సోషల్ మీడియాలో ట్రోల్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Yami Gautham: హీరోయిన్ యామీ గౌతమ్‏కు షాకిచ్చిన ఈడీ.. మనీలాండరింగ్ ఆరోపణలతో నోటీసులు.. స్టేట్‏మెంట్ ఇవ్వాలని..

Oscar Academy: ఆస్కార్ అకాడ‌మీలో భారతీయ తారలు.. స‌భ్యులుగా విద్యాబాల‌న్‌, ఏక్తా క‌పూర్‌కు చోటు..

Hungama 2 : యంగ్ క‌పుల్‌, సీనియ‌ర్ క‌పుల్ జీవితాల్లో నెలకొన్న గందరగోళం.. ఆకట్టుకుంటున్న ట్రైలర్