అంతరిక్షంలోకి ఆంధ్రా అమ్మాయి.. స్పేస్ ఫ్లేస్ సంపాదించిన గుంటూరు యువతి

Indian Woman fly into space: అంతరిక్ష వాణిజ్య యాత్రల కోసం బ్రాన్సన్‌ సంస్థ సిద్దం చేసిన‘ వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ’ అనే ప్రత్యేక వ్యోమనౌక ద్వారా భారత సంతతికి చెందిన శిరీష బండ్ల...

అంతరిక్షంలోకి ఆంధ్రా అమ్మాయి.. స్పేస్ ఫ్లేస్ సంపాదించిన గుంటూరు యువతి
Bandla Sirisha
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 03, 2021 | 12:14 PM

Indian Origin Woman fly into space: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన శిరీష బండ్ల అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నారు. అంతరిక్ష వాణిజ్య యాత్రల కోసం బ్రాన్సన్‌ సంస్థ సిద్దం చేసిన‘ వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ’ అనే ప్రత్యేక వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. కల్పనా చావ్లా, ఇండియన్‌ అమెరికన్‌ సునీతా విలయమ్స్‌ తరువాత అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న భారతీయ సంతతి మహిళల సరసన చేరారు. అలాగే, ఈ ఘనత సాధించిన తొలి తెలుగు తేజం. రెండవ భారతీయ మహిళ, నాల్గవ భారతీయురాలు కూడా చరిత్ర సృష్టించబోతున్నారు.

అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షయాన సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ఈ వ్యోమనౌకను నింగిలోకి పంపించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రాన్సన్‌తోపాటు ఐదుగురు వ్యక్తులు ప్రయాణించనున్నారు. వీరిలో సంస్థ ఉపాధ్యక్షురాలు, తెలుగు యువతి శిరీష​ కూడా చోటు దక్కించుకోవడం విశేషం. రిచర్డ్ బ్రాన్సన్‌తో కలిసి హాబ్‌నాబ్ చేయటం.. గర్వించదగ్గ విషయమంటూ శిరీష బంధువు రామారావు కన్నెగంటి సంతోషం వ్యక్తం చేశారు. ‘వర్జిన్ గెలాక్టిక్’ వ్యోమనౌకలో బ్రాన్సన్‌తో కలిసి ఆరుగురితో యూనిటీ 22 టెస్ట్ ఫ్లైట్ జూలై 11, గురువారం సాయంత్రం న్యూ మెక్సికో నుండి బయలుదేరుతుందని కంపెనీ ప్రకటించింది.

అంతరిక్ష ప్రయాణాల కోసం గత వారంలో వర్జిన్ గెలాక్టిక్‌ అమెరికాకు చెందిన ది ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులు సాధించిన సంగతి తెలిసిందే. ఈ రాకెట్‌లో అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఇప్పటికే దాదాపు 600మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారట. మరోవైపు, అమెజాన్ చీఫ్‌ జెఫ్ బెజోస్ ఈ నెల 20న అంతరిక్ష పర్యటనకు పోటీగా ఆయన కంటే ముందుగానే వర్జిన్ గెలాక్టిక్ రంగంలోకి దిగుతుండటం గమనార్హం.

ఇదిలావుంటే, భారత సంతతికి చెందిన శిరీషా.. పర్డ్యూ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. జార్జ్‌టౌన్ యూనివర్సిటి నుండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పట్టా పొందారు. 2015లో వర్జిన్ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాల మేనేజర్‌గా బండ్ల శిరీష చేరారు. అప్పటినుండి వర్జిన్ ఆర్బిట్ కోసం వాషింగ్టన్ కార్యకలాపాలను నిర్వహిస్తూ అనేక ఉన్నత ర్యాంకులను సొంతం చేసుకున్నారు. తాజాగా జూలై 11న బయలుదేరనున్న ‘వర్జిన్ గెలాక్టిక్’ వ్యోమనౌకలో చోటు సంపాదించుకున్నారు. చీఫ్ ఆస్ట్రోనాట్ ఇన్‌స్ట్రక్టర్ బెత్ మోసెస్, లీడ్ ఆపరేషన్స్ ఇంజనీర్ కాలిన్ బెన్నెట్ అంతరిక్షంలోకి పయనించనున్నారు.

Read Also…. Bengaluru Loud Sounds: బెంగళూరులో భారీ వింత శబ్దాలు.. ఊగిపోతున్న కిటికీలు.. ఉలిక్కిపడ్డ నగరవాసులు.. సోషల్‌ మీడియాలో వైరల్‌..!?

ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు
ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..
ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..
ఛీటింగ్.. టిమ్ డేవిడ్, పోలార్డ్‌లకు భారీ షాక్.. ఏం జరిగిందంటే?
ఛీటింగ్.. టిమ్ డేవిడ్, పోలార్డ్‌లకు భారీ షాక్.. ఏం జరిగిందంటే?
‘అప్పట్లో ఆ హీరోయిన్‌ను ఇష్టపడ్డా.. ఆ తర్వాత..’
‘అప్పట్లో ఆ హీరోయిన్‌ను ఇష్టపడ్డా.. ఆ తర్వాత..’
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!