Sweat Benfits : శరీరం నుంచి చెమట ఎందుకు వస్తుంది..! అది ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా.. తెలుసుకోండి..

Sweat Benfits : చెమట పట్టడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ అసలు శరీరం నుంచి చెమట ఎందుకు వస్తుందో తెలుసుకోండి. పూర్వకాలంలో

Sweat Benfits : శరీరం నుంచి చెమట ఎందుకు వస్తుంది..! అది ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా.. తెలుసుకోండి..
Sweat Problems
Follow us
uppula Raju

|

Updated on: Jul 02, 2021 | 1:53 PM

Sweat Benfits : చెమట పట్టడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ అసలు శరీరం నుంచి చెమట ఎందుకు వస్తుందో తెలుసుకోండి. పూర్వకాలంలో ప్రజలు కష్టపడి పనిచేసేవారు కనుక వారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేవారు. కానీ నేటి కాలంలో అన్ని పనులు ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌లపై ఆధారపడి చేస్తున్నారు. ప్రజలు శారీరక శ్రమ సరిగ్గా చేయడం లేదు. దీంతో చాలామంది కొద్దిపాటి కష్టాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు. కొద్దిగా చెమట వచ్చినా సహించలేకపోతున్నారు. కానీ శరీరం నుంచి చెమట రావడం చాలా ముఖ్యమని తెలుసుకోండి. అసలైన చెమట అంటే శరీరం నుంచి బయటకు వచ్చే చిన్న నీటి బిందువులు. ఇందులో అమ్మోనియా, యూరియా, ఉప్పు, చక్కెర మొదలైనవి ఉంటాయి. మన శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, శరీరం నీటిని పీల్చుకోవడానికి చెమట గ్రంథులు సక్రియం చేయబడతాయి. శరీరం నుంచి వచ్చే నీరు హీట్ స్ట్రోక్ వంటి ప్రమాదాల నుంచి కూడా మనలను రక్షిస్తుంది. ఈ నీటిని మనం సాధారణ భాషలో చెమట అని పిలుస్తాము.

1. వ్యాయామం సమయంలో చెమట మీరు వ్యాయామం చేసేటప్పుడు చెమట పట్టడం చాలా ముఖ్యం ఎందుకంటే మీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. అటువంటి పరిస్థితిలో చెమట మీ శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. మూర్ఛను నివారిస్తుంది.

2. శరీరం నుంచి విష పదార్థాలను బయటకు తీస్తుంది.. చెమట మీ శరీరం నుంచి విషాన్ని బయటకు పంపిస్తుంది. కొన్ని పరిశోధనలు చెమటలో ఉప్పు, చక్కెర కాకుండా, కొలెస్ట్రాల్, ఆల్కహాల్ వంటి పదార్థాలు కూడా ఉన్నాయని సూచిస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో శరీరం బాగా శుభ్రం అవుతుంది అన్ని అవయవాలు మెరుగ్గా పనిచేస్తాయి.

3. చెమట చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది చెమట బయటకు వచ్చినప్పుడు, చర్మంపై షైన్ వస్తుందని చెబుతారు. అసలైన చెమట కారణంగా చర్మం రంధ్రాలు తెరవబడతాయి. అటువంటి పరిస్థితిలో చర్మంపై పేరుకుపోయిన టాక్సిన్స్ కూడా చెమట ద్వారా బయటకు వస్తాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా చేస్తుంది అన్ని సమస్యలు తొలగిపోతాయి కూడా.

4. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది రోజూ పని చేసేటప్పుడు చెమట పడితే అది మీ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఈ కారణంగా మీ శరీరం అన్ని వ్యాధులపై పోరాడే శక్తిని అభివృద్ధి చేస్తుంది. మీరు తక్కువ అనారోగ్యానికి గురవుతారు.

viral photos : పెద్ద పెద్ద రాళ్లు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళుతున్నాయి..! శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని కనుగొనలేకపోతున్నారు..

RRB NTPC Phase 7 exam -2021 : ఆర్‌ఆర్‌బి ఎన్‌టీపీసీ పరీక్ష తేదీ ఖరారు..! అడ్మిట్ కార్డు ఎప్పుడు వస్తుంది..? ఏ పోస్టుకు ఎంత జీతం..

MLA Roja: విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో అన్యాయం చేయొద్దు.. వ్యక్తిగతంగా విమర్శిస్తే మర్యాదగా ఉండదన్న రోజా