- Telugu News Photo Gallery Viral photos Viral photos the stones in death valley are moving from one place to another
viral photos : పెద్ద పెద్ద రాళ్లు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళుతున్నాయి..! శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని కనుగొనలేకపోతున్నారు..
viral photos : ఆధునిక కాలంలో సైన్స్ ఎంతో పురోగతి సాధించినా కొన్ని రహస్యాలు మాత్రం మిస్టరీగానే మిగిలిపోయాయి. శాస్త్రవేత్తలు కూడా అందులో ఉన్న మర్మమేమిటో కనుక్కోలేకపోతున్నారు..
Updated on: Jul 02, 2021 | 1:05 PM

సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా కొన్ని రహస్యాలు మాత్రం మిస్టరీగానే మిగిలిపోయాయి. ఈ రోజు తూర్పు కాలిఫోర్నియాలో ఉన్న డెత్ వ్యాలీ అని పిలువబడే ఎడారి గురించి తెలుసుకుందాం.

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. సెల్ఫ్ స్లైడింగ్ రాళ్ళు. ఇవి సెయిలింగ్ స్టోన్స్ అని ప్రపంచానికి తెలుసు. రేస్ ట్రాక్ ప్రాంతంలో ఉన్న 320 కిలోల రాళ్ళు కూడా సొంతంగా కదులుతుంటాయి. డెత్ వ్యాలీలో రాళ్ల ఆకస్మిక కదలిక శాస్త్రవేత్తలకు కూడా ఒక పజిల్‌గా మిగిలిపోయింది.

ఈ రహస్యాన్ని పరిష్కరించడానికి 1972 సంవత్సరంలో శాస్త్రవేత్తల బృందం ఏర్పడింది. ఈ బృందం రాళ్ల సమూహాన్ని ఏడు సంవత్సరాలు అధ్యయనం చేసింది. కెరిన్ అనే 317 కిలోగ్రాముల రాయి అధ్యయనం సమయంలో అస్సలు కదలలేదు. కానీ కొన్ని సంవత్సరాల తరువాత శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్లినప్పుడు ఆ రాయి కిలోమీటరు దూరంలో ఉన్నట్లు వారు కనుగొన్నారు.

అయితే శాస్త్రవేత్తలు వేగవంతమైన గాలుల కారణంగా రాళ్ళు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదులుతాయని భావించారు. ఎడారిలో గంటకు 90 మైళ్ల వేగంతో గాలి వీస్తుందని, రాత్రి సమయంలో గడ్డకట్టే మంచు, ఉపరితలం పైన ఉన్న తడి నేల ఇవన్నీ కలిసి రాళ్లు కదులుతున్నాయని వెల్లడించారు.

అయితే కొంతమంది మాత్రం అతీంద్రియ శక్తుల వల్ల జరుగుతాయని నమ్ముతారు. విస్తృతమైన పరిశోధనల తరువాత స్పెయిన్ కాంప్లూటెన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు సూక్ష్మజీవుల వల్ల కదులుతున్నాయని పేర్కొన్నారు.



