Virushka Viral Photos: క్రికెటర్ పెళ్లిలో భార్యతో కలిసి చిందులేసిన టీమిండియా కెప్టెన్..! వైరలవుతోన్న ఆనాటి ఫొటోలు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిత్యం ఏదోరకంగా నెటిజన్ల కంట పడుతూనే ఉంటున్నాడు. ఇప్పటి విషయాలే కాదు, పాత వాటిని కూడా కోహ్లీ అభిమానులు ట్రెండింగ్ చేస్తూ ఉంటారు.

Virushka Viral Photos: క్రికెటర్ పెళ్లిలో భార్యతో కలిసి చిందులేసిన టీమిండియా కెప్టెన్..! వైరలవుతోన్న ఆనాటి ఫొటోలు
Virushka Viral Photos
Follow us
Venkata Chari

|

Updated on: Jul 02, 2021 | 12:18 PM

Virushka Viral Photos: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిత్యం ఏదోరకంగా నెటిజన్ల కంట పడుతూనే ఉంటున్నాడు. ఇప్పటి విషయాలే కాదు, పాత వాటిని కూడా కోహ్లీ అభిమానులు ట్రెండింగ్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఎప్పుడో 2017లో జరిగిన విషయాన్ని ప్రస్తుతం ట్రెండ్ చేస్తున్నారు. అసలు విషయానికి వస్తే.. విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ 2017లో టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంలో మంచి పార్టీ మూడ్ లో ఉన్న టీమిండియా సారథి.. భార్యతో కలిసి చిందులేశాడు. మరికాస్త ముందడుగు వేసి, అనుష్క శర్మ దుపట్టాను పట్టుకుని లాగుతూ అందరి ముందు సరదాగా చిందులేశాడు. దీనికి అనుష్క కూడా నవ్వూతూ ఓకే అన్నట్లుగా కోహ్లీ తో కలిసి డ్యాన్స్ చేసేందుకు సిద్ధమైనట్లుగా కనిపించింది. జహీర్ ఖాన్ టీమిండియా తరపున 14 సంవత్సరాలు క్రికెట్ లో కొనసాగాడు. 2015లో తను క్రికెట్ కు స్వస్తి పలికాడు. నిర్మాతగా, హీరోయిన్ గా రాణిస్తున్న అనుష్క శర్మ జంటకు ఈ ఏడాది జనవరి 11న ఓ పాప జన్మించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫొటోను కూడా నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు. విరుష్క గా పిలిచే ఈ జంట వారి పాపకు వామికా అనే పేరును పెట్టినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఫొటో లో విరాట్, అనుష్క ఇద్దరూ వారి పాపని ఎత్తుకుని మురిసి పోతున్నారు.

పెళ్లికి ముందు ఇద్దరూ కలిసి ఓ షాంపు యాడ్ లోనటించారు. అనంతరం ప్రేమలో ఉన్న ఈ జంట.. 2017 డిసెంబర్ లో వివాహం చేసుకున్నారు. ప్రేమలో ఉన్నప్పుడు జంటగా షికార్లు చేస్తూ.. ఎన్నో సార్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ జంట. పెళ్లి అనంతరం చానాళ్లకు ముంబై, ఢిల్లీలో వెడ్డింగ్ పార్టీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీరి పెళ్లినాటి ఓ ఫొటోకూడా నెట్టింట్లో బాగా తిరుగుతోంది.

రబ్ నే బనాది జోడి, పీకే, బ్యాండ్ బాజా బారాత్, సుల్తాన్, ఏ దిల్ హై ముష్కిల్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో అనుష్క శర్మ నటించింది. అనుష్క శర్మ చివరిసారిగా షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్ తో కలిసి 2018 లో జీరో సినిమాలో కనిపించింది. అనంతరం నిర్మాతగా మారిన ఆమె…బుల్బుల్ సినిమాను తీసి, నెట్‌ఫ్లిక్స్ లో విడుదల చేసింది. ఈ సినిమా భారీ విజయం సాధించింది. దీంతోపాటు అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసిన వెబ్-సిరీస్ పాటల్ లోక్ ను కూడా తనే నిర్మించింది.

Also Read:

IND vs ENG: గాయంతో టీమిండియా ఓపెనర్ ఔట్..! ఈ ముగ్గురిలో ఛాన్స్ ఎవరికో..?

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ బరిలో నిలిచేది వీరే.. ! ప్రకటించిన ఐఓఏ

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ బరిలో నిలిచేది వీరే.. ! ప్రకటించిన ఐఓఏ