Thyroid Patients : థైరాయిడ్ రోగులు ఈ పదార్థాలను అస్సలు తినవద్దు..! ఒకవేళ తిన్నారో ఇక అంతే సంగతులు..
Thyroid Patients : ఆరోగ్యకరమైన జీవన శైలికి మంచి ఆహారం తీసుకోవడం ముఖ్యం. థైరాయిడ్ హార్మోన్ మన శరీరానికి చాలా ముఖ్యమైంది. ఇది కణాలను రిపేర్
Thyroid Patients : ఆరోగ్యకరమైన జీవన శైలికి మంచి ఆహారం తీసుకోవడం ముఖ్యం. థైరాయిడ్ హార్మోన్ మన శరీరానికి చాలా ముఖ్యమైంది. ఇది కణాలను రిపేర్ చేయడంలో, జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. థైరాయిడ్ హార్మోన్ మెడ దగ్గర ఉంటుంది. శరీరంలో థైరాయిడ్ హార్మోన్ తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అయినప్పుడు హైపోథైరాయిడిజం, అధికంగా ఉన్నప్పుడు హైపర్ థైరాయిడిజం సంభవిస్తుంది. మహిళల్లో థైరాయిడ్ ప్రమాదం పురుషుల కంటే 10 రెట్లు ఎక్కువ. మీరు బరువు పెరుగుతుంటే, గొంతులో వాపు, జుట్టు రాలడం వంటి సమస్యలు ఉంటే థైరాయిడ్ కావొచ్చు. సరైన ఆహారం తినడం వల్ల ఈ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చు. కానీ ఈ ఆహారాలను మాత్రం థైరాయిడ్ రోగులు ఎప్పుడు తినకూడదు. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.
1. క్యాబేజీ, కాలీఫ్లవర్ మీకు థైరాయిడ్ సమస్యలు ఉంటే కాలీఫ్లవర్, క్యాబేజీని తినకండి. ఈ కూరగాయలు, ఆకులలో కనిపించే గోయిట్రోజెన్లు థైరాయిడ్‌కు సంబంధించిన సమస్యను పెంచుతాయి. కనుక మీరు వాటిని మీ ఆహారంలో చేర్చకపోవడమే మంచిది.
2. కెఫిన్ టీ, కాఫీ వంటి కెఫిన్ పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇది థైరాయిడ్ గ్రంథిని ప్రభావితం చేస్తుంది. క్రమంగా మీ రక్తంలో థైరాయిడ్ స్థాయిని పెంచుతుంది. ఇది రోగి పరిస్థితిని మరింత దిగజార్చుతుంది.
3. రెడ్ మీట్ మీరు ఎర్ర మాంసాన్ని తినకూడదు. ఎందుకంటే ఇందులో సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది థైరాయిడ్ రోగులకు హానికరం. ఈ కారణంగా మీ శరీర ఉష్ణోగ్రత అసాధారణ స్థాయికి పెరుగుతుంది. అందుకే దీనిని నివారించాలి.
4. సోయాబీన్ సోయాబీన్ ఇది శరీరంలో థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని, దాని సంబంధిత ఎంజైములను ప్రభావితం చేస్తుంది. ఫైటోఈస్ట్రోజెన్ అధికంగా తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్య పెరుగుతుంది. కనుక దీనిని నివారించాలి.