AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Papikondalu: పాపికొండల విహారయాత్రను ప్రారంభించిన మంత్రి అవంతి శ్రీనివాస్‌.. బోటింగ్‌కు బుకింగ్‌ ప్రారంభం

Papikondalu: దాదాపు 21 నెలలుగా నిలిచిపోయిన పాపికొండ విహార యాత్ర తిరిగి ప్రారంభమైంది. ఈ యాత్రను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ ప్రారంభించారు..

Papikondalu: పాపికొండల విహారయాత్రను ప్రారంభించిన మంత్రి అవంతి శ్రీనివాస్‌.. బోటింగ్‌కు బుకింగ్‌ ప్రారంభం
Subhash Goud
|

Updated on: Jul 01, 2021 | 10:21 PM

Share

Papikondalu: దాదాపు 21 నెలలుగా నిలిచిపోయిన పాపికొండ విహార యాత్ర తిరిగి ప్రారంభమైంది. ఈ యాత్రను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ ప్రారంభించారు. పాపికొండల విహారయాత్రకు వెళ్లే టూరిజం బోట్ల ట్రయిల్ రన్‌లో మంత్రి అవంతి పాల్గొన్నారు. కచ్చులూరు దుర్ఘటన, కొవిడ్ పరిస్థితుల కారణంగా తూర్పుగోదావరి జిల్లా పాపికొండల టూరిజం 21 నెలలుగా నిలిపి వేశారు. అయితే శుక్రవారం నుంచి పాపికొండల బోటింగ్‌కు బుకింగ్స్ ప్రారంభం అవుతాయని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాపికొండల బోట్ షికారుకు ముందుగా ఆరు టూరిజం బోట్లకు అనుమతి ఇచ్చామని, శుక్రవారం నుంచి బోటింగ్‌కు బుకింగ్స్‌ ప్రారంభం అవుతుందని అన్నారు.

గతంలో జరిగిన ప్రమాద ఘటన దృష్ట్యా రాష్ట్రంలో బోటు షికార్ల పర్యవేక్షణకు తొమ్మిది కమాండ్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామని అన్నారు. పర్యాటకులు ఎవరు బోటు షికారులో మద్యపానం తీసుకోవద్దని కోరారు. పోలవరం ప్రాజెక్టు వద్ద టూరిజం అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, మరో నెలరోజుల్లో పోలవరం వద్ద ఏర్పాటు చేయబోయే టూరిజం ప్రాజెక్టులపై స్పష్టత వస్తుందన్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం తరహాలో పోలవరం వద్ద టూరిజం అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాలు ఇచ్చారని వివరించారు. పోలవరం , గండిపోశమ్మ, పేరంటాళ్లపల్లి ట్రైసర్క్యూట్ గా టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు.

ఇవీ కూడా చదవండి:

CM YS Jagan Letter to PM Modi: తెలుగు రాష్ట్రాల జలజగడంలో మరో ట్విస్ట్.. జోక్యం చేసుకోవాలంటూ ఏపీ సీఎం ప్రధానికి లేఖ

Assembly Constituencies: కాశ్మీర్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచడానికి రంగం సిద్దం అయిందా?