CM YS Jagan Letter to PM Modi: తెలుగు రాష్ట్రాల జలజగడంలో మరో ట్విస్ట్.. జోక్యం చేసుకోవాలంటూ ఏపీ సీఎం ప్రధానికి లేఖ
తెలుగు రాష్ట్రాల మధ్య రాజుకున్న జల జగడంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రధానమంత్రి మోదీకి, జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు లేఖ రాశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
CM YS Jagan Letter to PM Modi: తెలుగు రాష్ట్రాల మధ్య రాజుకున్న జల జగడంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రధానమంత్రి మోదీకి, జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు లేఖ రాశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలిస్తోందని అందులో ఫిర్యాదు చేశారు. విద్యుత్ ఉత్పత్తిని నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు CM జగన్. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌ల దగ్గర సెక్యూరిటీ పెంచాలన్నారు.
కృష్ణా జల వివాదం నేపథ్యంలో నీటి వినియోగంపై తెలంగాణ తీరును తప్పుబడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు లేఖలు రాశారు. ఏపీ ప్రయోజనాలను తెలంగాణ ప్రభుత్వం దెబ్బతీస్తోందని లేఖలో ఫిర్యాదు చేశారు సీఎం జగన్. కృష్ణా బోర్డు అనుమతితోనే నీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రిని, జల్‌శక్తి మంత్రిని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలను ఉల్లంఘించిందని జగన్ ఆరోపించారు. తెలంగాణ ఉల్లంఘనలపై కేఆర్‌ఎంబీకి రాసిన లేఖలను ప్రధాని, జలశక్తి మంత్రికి రాసిన లేఖలకు జతపరిచారు. D.O.Lr.No.39 -Request to Government of India to notify the jurisdiction of KRMB and take over all offtakes with CISF to safeguard the interests of the A.P. – Jal Sakthi Minister