Tirumala Hundi: భారీగా పెరిగిన తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం.. జూన్‌ నెలలో ఎంత వచ్చిందంటే..!

Tirumala Hundi: తిరుమల శ్రీవారికి భక్తులు భారీగా ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో కూడా స్వామి వారికి భక్తులు ఉంటారు. విదేశాల నుంచి ఎంతో..

Tirumala Hundi: భారీగా పెరిగిన తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం.. జూన్‌ నెలలో ఎంత వచ్చిందంటే..!
Follow us

|

Updated on: Jul 02, 2021 | 6:11 AM

Tirumala Hundi: తిరుమల శ్రీవారికి భక్తులు భారీగా ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో కూడా స్వామి వారికి భక్తులు ఉంటారు. విదేశాల నుంచి ఎంతో మంది శ్రీవారిని దర్శించుకుని తమతమ మొక్కులను చెల్లించుకుంటారు. అయితే శ్రీవారిని జూన్‌లో దర్శించుకున్న భక్తుల సంఖ్య స్వల్పంగా ఉన్నప్పటికీ హుండీ ఆదాయం మాత్రం భారీగా పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తెలిపింది. గత నెలలో శ్రీవారిని 4,14,674 మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.36.02 కోట్లు సమకూరినట్టు టీటీడీ గురువారం తెలిపింది. అలాగే 1లక్షా 67,396 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. అయితే తిరుమల వేంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం ఎప్పుడు తగ్గదు. కరోనా కాలంలో భక్తుల సంఖ్య తగ్గింది తప్ప ఎప్పుడు కూడా భక్తులతో తిరుమల వెంకన్న కొండ కిటకిటలాడుతుంది. స్వామివారికి కానుకలు, మొక్కలు అధిక సంఖ్యలో చెల్లించుకుంటారు.  తిరుమలలో భక్తులకు సేవలందించే కేంద్రాలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నది. లడ్డూ వితరణ, కల్యాణ కట్ట కేంద్రాలు, వైకుంఠం టికెట్ల తనిఖీ కేంద్రం, సర్వదర్శనం టైంస్లాట్‌ టోకెన్ల జారీని కూడా అప్పగించారు.

ఇవీ కూడా చదవండి:

TTD News: టీటీడీ షాకింగ్ నిర్ణయం.. ఆ ఉద్యోగులకు జీతాలు కట్

TTD News: భక్తులకు సేవలందించే కేంద్రాలను ప్రైవేట్​ ఏజెన్సీకి అప్పగించిన టీటీడీ