AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD News: టీటీడీ షాకింగ్ నిర్ణయం.. ఆ ఉద్యోగులకు జీతాలు కట్

కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే ప్రధాన మార్గం. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే విషయాన్ని పదే, పదే చెబుతున్నాయి.

TTD News: టీటీడీ షాకింగ్ నిర్ణయం.. ఆ ఉద్యోగులకు జీతాలు కట్
TTD
Ram Naramaneni
|

Updated on: Jul 01, 2021 | 1:37 PM

Share

కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే ప్రధాన మార్గం. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే విషయాన్ని పదే, పదే చెబుతున్నాయి. అపోహలను వీడి 18 సంవత్సరాలు పైబడిన అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు అధికారులు.  దీంతో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అయింది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత ప్రచారం చేస్తూ ప్రజలందరికీ ఫ్రీగానే వ్యాక్సిన్ అందిస్తున్నాయి.  ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. కార్పోరేట్ సంస్థలతో పాటు అనే కంపెనీలు తమ ఎంప్లాయిస్‌కు కార్యాలయాల్లోనే వ్యాక్సిన్లు వేయిస్తున్నాయి. ఈ కోవలోనే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కూడా తమ ఉద్యోగులకు వ్యాక్సిన్లు వేయిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఉద్యోగులకు ఊహంచని షాక్ ఇచ్చింది. టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 45 సంవత్సరాలు పైబడి ఇంకా వ్యాక్సిన్ వేయించుకోని వారికి జీతాలు నిలిపివేయాలని ఈవో జవహర్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. చాలామంది ఎంప్లాయిస్ ఇంకా వ్యాక్సిన్ వేయించుకోలేదని సమాచారం అందడంతో టీటీడీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

జులై 7 లోపు ఆ ఎంప్లాయిస్ అంతా వ్యాక్సిన్ వేయించుకుని సంబంధిత సర్టిఫికెట్లను ఆయా డిపార్ట్‌మెంట్లలో అందజేయాలని ఈవో ఆదేశించారు. జులై 7 లోపు వ్యాక్సిన్ వేసుకున్న ఉద్యోగులకు జూలై 8న శాలరీస్ చెల్లించాలని ఈవో అధికారులను ఆదేశించారు. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. త్వరలోనే సర్వదర్శనం కూడా అమలు చేయనున్న నేపథ్యంలో ఉద్యోగులందరూ వీలైనంత త్వరగా వ్యాక్సిన్లు వేయించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆదేశించారు. అయినప్పటికీ కొందరు ఉద్యోగులు వ్యాక్సిన్ విషయంలో అపోహలకు లోనై.. అలసత్వం వహిస్తుండటంతో ఈవో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

Also Read:  కరోనా సమయంలో అయినవాళ్లు చనిపోతేనే పట్టించుకోవట్లేదు.. కానీ ఈ దంపతులు మాత్రం

‘రక్తం కావాలి’.. ఆంధ్రాలో తీవ్ర సమస్యగా బ్లడ్ షార్టేజ్