Pet Cremation: కరోనా సమయంలో అయినవాళ్లు చనిపోతేనే పట్టించుకోవట్లేదు.. కానీ ఈ దంపతులు మాత్రం

కరోనా కాలంలో మనుషుల్లో మానవత్వం లేకుండా పోయింది. కరోనా తో మరణించిన మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు...

Pet Cremation: కరోనా సమయంలో అయినవాళ్లు చనిపోతేనే పట్టించుకోవట్లేదు.. కానీ ఈ దంపతులు మాత్రం
Dog Final Rites
Follow us

|

Updated on: Jul 01, 2021 | 12:38 PM

కరోనా కాలంలో మనుషుల్లో మానవత్వం లేకుండా పోయింది. కరోనా తో మరణించిన మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు రక్త సంబంధీకులే భయపడి ఆసుపత్రిలో వదిలేసే వెళుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో  పెంచుకున్న శునకానికి సాంప్రదాయ బద్దంగా అంత్యక్రియలు నిర్వహించారు ఓ కానిస్టేబుల్ దంపతులు. ఈ ఘటన నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..  నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన వెంకోజి 15 సంవత్సరాల క్రితం గ్రామంలో ఉన్న వ్యవసాయ భూమిని అమ్మి శ్రీశైలం వెళ్లే దారిలో కొంత భూమిని కొనుగోలు చేశారు. ఆ స్థలంలో చిన్న టీ స్టాల్ పెట్టి తన భార్య లక్ష్మి కి అప్పచెప్పాడు. అప్పుడు ఆ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా వుండేది. 13 ఏళ్ల క్రితం తమకు తోడుగా ఉంటుందని ఒక చిన్న శునకాన్ని తెచ్చి చాలా ప్రేమగా పెంచుకున్నారు. ఆ టీ స్టాల్ ఇప్పుడు బాలాజీ రెస్టారెంట్ గా ఎదిగింది. శునకం తమకు తోడుగా ఉన్నదని ధైర్యంతో ఇలాంటి ప్రదేశంలో రెస్టారెంట్ ను కొనసాగించినట్లు ఆ దంపతులు చెప్పారు.

అయితే, ఇటీవల అనారోగ్యానికి గురైన వారి పెంపుడు కుక్క చనిపోయింది. దీంతో ఆ కానిస్టేబుల్ దంపతులు తమ కుటుంబ సభ్యులను కోల్పోయినంతగా బాధపడ్డారు. కుటుంబ సభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. శునకంపై పెంచుకున్న మమకారంతో దానికి మనుషులతో సమానంగా సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేసి కన్నీటి వీడ్కోలు పలికారు. తన సొంత వ్యవసాయ పొలంలోనే ఖననం చేసి మానవత్వం చాటుకున్నారు ఆ దంపతులు.

Also Read: తెలుగు రాష్ట్రాల సీఎంలపై ఎంపీ కేశినేని సంచలన వ్యాఖ్యలు.. అంతా డ్రామా అంటూ ఫైర్

ఆర్టీసీ బస్సుకు కరెంట్ షాక్.. మహిళ మృతి.. స‌మ‌యానికి ఆ మేస్త్రీ దేవుడిలా వ‌చ్చాడు

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..