Tipu Sultan Statue: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ కీలక నిర్ణయం.. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం
కడప జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రొద్దుటూరు జిన్నారోడ్డులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది.
Tipu Sultan Statue in Proddatur: కడప జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రొద్దుటూరు జిన్నారోడ్డులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. టిప్పుసుల్తాన్ దేశభక్తుడు, మత సామరస్యకుడని భావించి అతని విగ్రహాన్ని పెట్టడానికి ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నామన్నారు. భారత రాజ్యాంగలో 144వ పేజీలో టిప్పుసుల్తాన్ ఫోటో ఉందని, ఢిల్లీ అసెంబ్లీలో టిప్పుసుల్తాన్ ఫోటో కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. కర్నాటక నడిబొడ్డున ఉన్న టిప్పు సుల్తాన్ విగ్రహన్ని తొలగిస్తే మేము విగ్రహం ఏర్పాటు నిలిపివేస్తామని శివప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు.
గతంలో ప్రొద్దుటూరు జిన్నా రోడ్డులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు ఎమ్యెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి భూమి చేశారు. దీన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీన్ని బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని ఏపీ రాష్ట్ర బీజేపీ నాయకత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వేల మందిని ఊచకోతకోసిన టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం బాధాకరమన్నారు. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చెయ్యడం వెనుక కుట్రదాగి ఉందని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆరోపించారు. ఓట్ల కోసమే టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని.. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కూడా సుల్తాన్‌గా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
Read Also.. కుబేరుడు భార్య చిత్రలేఖతోనూ శ్రీమహలక్ష్మితోనూ కొలువైన ఆలయం ఎక్కడంటే