TDP: ఉద్యోగాలు అడిగితే కేసులు పెడతారా.. ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు విమర్శలు
ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. జాబ్ లెస్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగల నెత్తిన నీళ్లు పోశారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఉద్యోగాల విప్లవం...
ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. జాబ్ లెస్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగల నెత్తిన నీళ్లు పోశారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామని మోసం చేశారని విమర్శించారు. రెండేళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని..? ఉద్యోగాలివ్వాలని నిలదీసిన నిరుద్యోగులపై ఏకంగా అత్యాచారం కేసులా.? పెడతారా అంటూ ప్రశ్నించారు. రెండున్నర లక్షల ఉద్యోగాలిస్తామని ఊరించారు… ఇప్పుడు రెండేళ్ల తర్వాత 10వేల ఉద్యోగాలంటూ మరోసారి మోసం చేస్తున్నారని కామెంట్ చేశారు. ఉద్యోగాల విషయంలోనూ నోటిఫికేషన్లు ఇస్తూ పోతామనడం మోసం కాదా.? అని అడిగారు. ఉద్యోగాల కాలెండర్‌లో ఉద్యోగాలు ఇక్కడ..? అంటూ నిప్పులు చెరిగారు. పత్రికల్లో భారీ ప్రకటనలు తప్ప.. జాబ్ క్యాలెండర్ లో జాబ్స్ లేవని ఎద్దేవ చేశారు.
టీడీపీ హయాంలోని పథకాలనే కాదు.. యాప్ లను కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం కాపీ కొడుతోందని పేర్కొన్నారు. ఫోర్త్ లయన్ యాప్ ను కాపీ కొట్టి దిశ యాప్ పేరుతో హడావుడి చేస్తోందన్నారు.