AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD News: భక్తులకు సేవలందించే కేంద్రాలను ప్రైవేట్​ ఏజెన్సీకి అప్పగించిన టీటీడీ

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు మ‌రింత పారదర్శక సేవలు అందించేందుకు టీటీడీ కౌంట‌ర్ల‌ను మ‌రింత నైపుణ్యంతో...

TTD News: భక్తులకు సేవలందించే కేంద్రాలను ప్రైవేట్​ ఏజెన్సీకి అప్పగించిన టీటీడీ
Ttd
Ram Naramaneni
|

Updated on: Jul 01, 2021 | 3:50 PM

Share

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు మ‌రింత పారదర్శక సేవలు అందించేందుకు టీటీడీ కౌంట‌ర్ల‌ను మ‌రింత నైపుణ్యంతో నిర్వ‌హించ‌నున్న‌ట్లు అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. ఇందుకుగాను వృత్తి నిపుణ‌త క‌లిగిన ఏజెన్సీల ద్వారా నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెప్పారు. ఇందులో భాగంగా గురువారంనాడు తిరుమ‌ల‌లోని ల‌డ్డూ కౌంట‌ర్లలో ఆయ‌న పూజ‌లు నిర్వ‌హించి ఏజెన్సీ సిబ్బందితో ల‌డ్డూ కౌంట‌ర్లలో సేవ‌ల‌ను ప్రారంభించారు. అనంత‌రం అద‌న‌పు ఈవో మీడియాతో మాట్లాడుతూ టీటీడీలో భ‌క్తుల‌కు విశేష సేవ‌లందిస్తున్న ప‌లు  కౌంట‌ర్ల‌ను మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా, వృత్తి నిపుణ‌త‌తో నిర్వ‌హించే ఏజెన్సీల‌ను ఆహ్వానించామ‌న్నారు. ఇందులో బెంగుళూరుకు చెందిన‌ కెవిఎం ఎన్‌ఫో అతి తక్కువ ధరకు టెండ‌రు వేసింద‌న్నారు. ఇకపై తిరుమ‌లలోని ల‌డ్డూ కౌంట‌ర్లు, క‌ల్యాణ క‌ట్ట త‌ల‌నీలాలు స‌మ‌ర్పిచే భ‌క్తులకు టోకెన్లు ఇచ్చే కౌంట‌ర్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ద‌ర్శ‌నం టికెట్లు స్కానింగ్ కౌంట‌ర్లు, తిరుప‌తిలోని ఎస్‌ఎస్‌డి కౌంట‌ర్లు, అలిపిరి టోల్‌గేట్ వ‌ద్ద ఉన్న కౌంట‌ర్లు ఈ ఏజెన్సీ చేత నిర్వహించబడతాయ‌న్నారు.

తిరుమల, తిరుప‌తిల‌లో యాత్రికులకు సేవ‌లందించే 164 కౌంటర్ల‌లో మూడు షిఫ్టులలో నడపడానికి 430 మంది సిబ్బంది అవ‌స‌ర‌మ‌ని చెప్పారు. కౌంట‌ర్ల‌లో విధులు నిర్వ‌హించే సిబ్బందికి ఒక వారం పాటు శిక్షణ ఇచ్చామ‌న్నారు. వారి వేతనాలు ప్రభుత్వ కనీస వేతన నిబంధనల ప్రకారం ఉంటాయ‌ని, ఇపిఎఫ్, ఇఎస్ఐ ప్రయోజనాలు క‌ల్పిస్తామ‌ని చెప్పారు. కౌంట‌ర్ల‌లో ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు రోటేష‌న్ ప‌ద్ధ‌తిలో వారం వారం ఈ సిబ్బందిని మార్చ‌నున్న‌ట్లు వివ‌రించారు. అనంత‌రం ఆయ‌న ల‌డ్డూ కౌంట‌ర్ల‌లో ల‌డ్డూల పంపీణిని ప‌రిశీలించారు. అనంత‌రం బూంది పోటును ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, పోటు పేష్కార్ శ్రీ శ్రీ‌నివాసులు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Also Read: TTD News: టీటీడీ షాకింగ్ నిర్ణయం.. ఆ ఉద్యోగులకు జీతాలు కట్

‘రక్తం కావాలి’.. ఆంధ్రాలో తీవ్ర సమస్యగా బ్లడ్ షార్టేజ్

Follow Us
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం..!
ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం..!
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..
గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు
గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు