Tirupati Murder Case: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భువనేశ్వరి హత్య కేసులో నిందితుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్

Tirupati Murder Case: తిరుపతిలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భువనేశ్వరి ఇటీవల భర్త చేతిలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

Tirupati Murder Case: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భువనేశ్వరి హత్య కేసులో నిందితుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్
Tirupati Murder Case
Follow us
KVD Varma

|

Updated on: Jul 02, 2021 | 6:32 PM

Tirupati Murder Case: తిరుపతిలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భువనేశ్వరి ఇటీవల భర్త చేతిలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపధ్యంలో నిందితుడిని మీడియా ముందుకు హాజరు పరిచారు. భువనేశ్వరి హత్య జరిగిన తీరును వివరించారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన భువనేశ్వరిని 2018లో వివాహం చేసుకున్న దగ్గర నుంచి డబ్బుల కోసం ఘర్షణ శ్రీకాంత్ రెడ్డి పడుతూనే ఉండేవాడు. భువనేశ్వరి ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇంజనీర్ గా పని చేస్తోంది. శ్రీకాంత్ రెడ్డి ఖాళీగా ఉంటున్నాడు. నిత్యం భార్యతో డబ్బు కోసం గొడవ పడేవాడు. ఈ నేపధ్యంలో ఆమె తెలిసిన వారి వద్ద నుంచి పది లక్షల రూపాలు తీసుకువచ్చి భర్తకు ఇచ్చింది. ఆ అప్పు తీర్చాలని ఇటీవల ఆమె శ్రీకాంత్ రెడ్డిని అడుగుతూ వస్తోంది. దీంతో వీరి మధ్య గొడవలు మరింత ముదిరాయి. గత నెల 22వ తేదీన పథకం ప్రకారం భువనేశ్వరిని హత్య చేశాడు శ్రీకాంత్ రెడ్డి. నిద్రపోతున్న భార్యను దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు.

మొదట ఆమెను హత్య చేసిన శ్రీకాంత్ రెడ్డి తరువాత పెద్ద నాటకానికి తెర తీశాడు. కరోనాతో తన భార్య చనిపోయింది అని నమ్మించే ప్రయత్నం చేశాడు. ముందు అందరూ అదే నిజమని నమ్మారు. అయితే, వారి ఇంటి వద్ద ఒక సీసీ టీవీ నుంచి లభించిన ఫుటేజీ శ్రీకాంత్ రెడ్డి కిరతకాన్ని వెలుగులోకి తీసుకు వచ్చింది. భార్యను కిరాతకంగా చంపిన శ్రీకాంత్ రెడ్డి సాక్ష్యాలను తారుమారు చేసే క్రమంలో ఆమె మృత దేహాన్ని సూట్ కేసులో ఉంచుకుని రుయా ఆసుపత్రి వెనుక తగుల పెట్టాడు. తరువాత కరోనాతో ఆమె చనిపోయింది అని కుటుంబాన్ని నమ్మించే ప్రయత్నం చేశాడు.

అంతకు ముందు ఆసుపత్రిలో ఉన్న తనకు డబ్బులు కావాలని భార్య స్నేహితులకు, ఆమె పేరిట ఫోన్ లో శ్రీకాంత్ రెడ్డి మెసేజ్ లు పంపించాడు. మొత్తమ్మీద సీసీ ఫుటేజీతో పోలీసులకు దొరికిపోయాడు. ఇక ఈ కేసులో మృత దేహాన్ని తరలించేందుకు శ్రీకాంత్ రెడ్డికి సహకరించిన టాక్సీ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అదేవిధంగా ఈ కేసు విచారణ సందర్భంలో శ్రీకాంత్ రెడ్డి పై కడప జిల్లాలో మరి కొన్ని కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

Also Read: Vijayawada Murder Case: హత్య చేస్తాడన్న భయంతోనే చంపేశారు.. దుర్గా అగ్రహారం మర్డర్ కేసును ఛేదించిన..

Darbhanga blast case: మీరు కూడా టెర్రర్ కుట్రలో ఇరుక్కోవచ్చు.. జర భద్రం..! దర్భాంగ కేసులో చిక్కుకున్న ఓ సామాన్యుడు..