Prakasam District: శ్రీగంధం తోటల్లో ఊహించని సిత్రాలు.. ఖంగుతిన్న ఖాకీలు.. మత్తు పదార్థాల తయారీ గుట్టు రట్టు

ప్రకాశం జిల్లాలో కలకలం చెలరేగింది. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తయారీ చేయడం స్థానికులను షాక్‌కు గురిచేసింది.  త్రిపురాంతకం మండలం కె.అన్నసముద్రం గ్రామ సమీపంలో...

Prakasam District:  శ్రీగంధం తోటల్లో ఊహించని సిత్రాలు.. ఖంగుతిన్న ఖాకీలు.. మత్తు పదార్థాల తయారీ గుట్టు రట్టు
Praksam District Drugs
Follow us

|

Updated on: Jul 02, 2021 | 7:02 PM

ఏపీలో డ్రగ్‌ దందా దుమ్మురేపుతోంది. పబ్బుల్లో, బార్లలోనే కాదు. ఈసారి కొంత వినూత్నంగా పంట పొలాల్లో. అవును… పంట పొలాలు మత్తు మందు తయారీ కేంద్రాలుగా మార్చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ప్రకాశం జిల్లాలో తాజాగా కలకలం చెలరేగింది. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తయారీ చేయడం స్థానికులను షాక్‌కు గురిచేసింది.  త్రిపురాంతకం మండలం కె.అన్నసముద్రం గ్రామ సమీపంలో 20 ఎకరాలు లీజుకు తీసుకుని శ్రీగంధం తోటలు వేశారు. తోట మధ్యలో రేకుల షెడ్ నిర్మించి ఓ పరిశ్రమను స్థాపించారు. ఈ షెడ్​లో మత్తుమందు తయారు చేస్తున్నట్లు గుంటూరు జిల్లా సెబ్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత గుంటూరు ఎస్​ఈబీ అధికారి చంద్రశేఖర రెడ్డి ఆధ్వర్యంలో దాడులు చేశారు. ఈ తనిఖీలో నిషేధ వస్తువులను వినియోగించి మత్తు పదార్థాలు తయారుచేస్తున్నట్లు గుర్తించారు. పౌడర్, మాత్రల రూపంలో ఉన్న మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 67 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. పరీక్షల నిమిత్తం మత్తు పదార్థాలను ల్యాబ్‌కు పంపించారు. షెడ్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మత్తుపదార్థాల తయారీ నిర్వాహకుడు గతంలో తెలంగాణలోని రామచంద్రాపురం వద్ద ఇలాంటి యూనిట్ నిర్వహిస్తుండగా… పోలీసులకు పట్టుబడి ఆరెస్ట్ అయ్యాడు. దీంతో ప్రకాశం జిల్లాలో మత్తుపదార్థాల తయారీ కేంద్రాన్ని స్థాపించి అక్రమంగా మాదకద్రవ్యాలు తయారు చేస్తున్నట్లు సమాచారం. గుంటూరు జిల్లా సెబ్ అధికారులు, ప్రకాశం జిల్లా అధికారులతో కలిసి ఈ దాడులు నిర్వహించారు.

ఇటీవల మదనపల్లెలో వెలుగులోకి వచ్చిన ఓపీఎం పోపీ సాగు…

కాగా చిత్తూరు జిల్లా మదనపల్లెలో నిషేధిత మాదక ద్రవ్యాలు సాగు చేస్తున్న బండారాన్ని ఈ ఏడాది మార్చిలో  అబ్కారీ అధికారులు బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. మామిడి తోటల మాటున గసగసాల పంటను అధికారులు గుర్తించారు. ఓపీఎం పోపీ అని పిలిచే గసగసాలు పంట సాగు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న అబ్కారీ అధికారులు దాడులు చేసిన పంటను స్వాధీనం చేసుకున్నారు.

Also Read: ఊర పందుల వాహనం హైజాక్‌..! సినిమా రేంజ్‌లో స్కెచ్.. వీడియో చూస్తే షాకవుతారు..

 ఏపీలో కొత్తగా 3,464 కరోనా కేసులు, యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా