Darbhanga Blasts: కైరానా టూ దర్భంగా వయా హైదరాబాద్..పాకిస్తాన్ నుంచి ఆదేశాలు..భారత్‌లో విధ్వంసాలు

Terror Attacks: దర్భంగా రైల్వే స్టేషన్లో బాంబు పేలుడు కేసు తీగ లాగితే తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు దాటి పాకిస్తాన్ వరకు డొంకంతా కదులుతోంది.

Darbhanga Blasts: కైరానా టూ దర్భంగా వయా హైదరాబాద్..పాకిస్తాన్ నుంచి ఆదేశాలు..భారత్‌లో విధ్వంసాలు
Darbhanga Blasts
Follow us

|

Updated on: Jul 02, 2021 | 7:49 PM

(మహాత్మ కొడియార్, టీవీ9 తెలుగు, ఢిల్లీ బ్యూరో)

Darbhanga Blasts: దర్భంగా రైల్వే స్టేషన్లో బాంబు పేలుడు కేసు తీగ లాగితే తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు దాటి పాకిస్తాన్ వరకు డొంకంతా కదులుతోంది. ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో ఊహించని సరికొత్త విషయాలు బయపడుతున్నాయి. ఉగ్రవాద చర్యగా ఏమాత్రం అనుమానం కలగని రీతిలో ప్రమాదాలను సృష్టించి భారీ ప్రాణనష్టం కల్గించే కుట్ర కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఈ మొత్తం కుట్రకు ఉత్తర్ ప్రదేశ్‌లోని కైరానా పట్టణం కేంద్ర బిందువుగా మారింది. కైరానా నుంచి హైదరాబాద్ మీదుగా దర్భంగా వరకు కదులుతున్న ఉగ్రవాదుల డొంకలో ఇప్పటి వరకు నలుగురు ఉగ్రవాదులను ఎన్ఐఏ అరెస్ట్ చేయగల్గింది. వీరందరికీ పాకిస్తాన్ నుంచి ఆదేశాలు అందుతున్నట్టు గుర్తించింది. కోడ్ భాషలో పరస్పరం మాట్లాడుకుంటూ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నట్టు తేలింది. మాలిక్ బ్రదర్స్ సహా అరెస్టయినవారి నివాసాల్లో జరిపిన సోదాల్లో కీలక సమాచారం బయటపడినట్టు తెలుస్తోంది.

ప్రమాదాన్ని తలపించేలా..

దర్యాప్తు సంస్థలను, పోలీసులను బురిడీ కొట్టిస్తూ విధ్వంసాలు సృష్టించేందుకు ఉగ్రవాదులు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. దర్భంగా పేలుడు కేసులో ఇదే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. నిజానికి ఈ బాంబు కాజీపేట – రామగుండం స్టేషన్ల మధ్య రైలు వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో పేలేలా ఏర్పాటు ఉగ్రవాదులు ఏర్పాటు చేశారు. తక్కువ తీవ్రత కల్గిన పేలుడుతో పార్శిల్ బోగీలో మంటలు చెలరేగాలన్నది ఉగ్రవాదుల స్కెచ్. రైలు వేగంగా ప్రయాణించేటప్పుడు మంటలు ఒక బోగీ నుంచి మరొక బోగీకి వేగంగా వ్యాపిస్తాయి. మంటలను గుర్తించి రైలును నిలిపివేసేలోగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా జరుగుతుంది. చూసేవారికి ఇదొక అగ్నిప్రమాదంగా కనిపిస్తుంది. మంటలు చెలరేగిన పార్శిల్ బోగీ అప్పటికే పూర్తిగా కాలిపోయి ఉంటుంది కాబట్టి, దర్యాప్తు బృందాలకు సరైన ఆధారాలు లభించే అవకాశం ఉండదు. పార్శిళ్లలో మంటలకు ఆస్కారం కల్గించే పదార్థాల కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని భావించేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అయితే ఉగ్రవాదులు అనుకున్నదొకటి, జరిగిందొకటి. దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలు దర్భంగా స్టేషన్ చేరుకున్న తర్వాత, పార్శిల్ సెక్షన్ నుంచి వస్తువులను కిందికి దించిన తర్వాత పేలుడు సంభవించింది. దీంతో ఉగ్రవాదుల అసలు కుట్ర బయటపడింది. మనిషి శరీరంలో నరాలు, నాడుల్లా దేశమంతా విస్తరించి ఉన్న రైల్వే నెట్‌వర్క్‌ ను ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టు తెలిసింది.

ఉగ్రవాదుల డొంక ‘కైరానా’

జూన్ 17న జరిగిన దర్భంగా స్టేషన్లో పేలుడు ఘటనపై ముందు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, ఆ తర్వాత బిహార్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌కి కేసును అప్పగించారు. కేసు తీవ్రత, వేర్వేరు రాష్ట్రాలతో ముడిపడ్డ వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకుని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. మొత్తంగా ఈ పార్శిల్ బాంబు బుక్ చేసిన మాలిక్ బ్రదర్స్ (నాసిర్ ఖాన్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్)ను హైదరాబాద్‌లో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. తాజాగా మహ్మద్ సలీం అహ్మద్ అలియాస్ హాజీ సలీం, కాఫిల్ అలియాస్ కఫీల్ అనే మరో ఇద్దరిని కూడా అరెస్టు చేసింది. అరెస్టయిన నలుగురిదీ ఒకే ఊరు. అదే ఉత్తర్ ప్రదేశ్‌లోని కైరానా.

ఉత్తర్ ప్రదేశ్, హరియాణా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఈ పట్టణం మత విద్వేషాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరొందింది. ఒక వర్గం దాడులను తట్టుకోలేక మెజారిటీ వర్గానికి చెందిన ప్రజలు పట్టణాన్ని వీడివెళ్లిపోయిన ఉదంతాలు అప్పట్లో సంచలనంగా మారాయి. ఆ పట్టణానికి చెందిన ఇక్బాల్ ఖానా అలియాస్ ఆసిఫ్ ఖానా పేరుమోసిన ఉగ్రవాది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో తలదాచుకుంటూ భారత్‌లో విధ్వంసాలకు కుట్రలు చేస్తున్నాడు. ఇక్బాల్ ఆదేశాల మేరకు మాలిక్ బ్రదర్స్ సహా మొత్తం నలుగురు పనిచేస్తున్నారు. ఇందులో నాసిర్ మాలిక్ కైరానాను విడిచి హైదరాబాద్‌లో చాలా కాలం క్రితం నుంచే స్థిరనివాసం ఏర్పర్చుకున్నాడు. వస్త్ర వ్యాపారం ముసుగులో చాపకింద నీరులా ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరిస్తున్నాడు. మూడు సార్లు పాకిస్తాన్ కూడా వెళ్లి వచ్చాడు. ఇక్బాల్ నుంచి ఎప్పటికప్పుడు సందేశాలు, ఆదేశాలు అందుకుంటూ అమలు చేస్తున్నాడు. కొద్ది నెలల క్రితం నాసిర్ సోదరుడు ఇమ్రాన్ కూడా హైదరాబాద్ చేరుకుని, సోదరుడితో పాటు ఉంటున్నాడు. అయితే రైళ్లలో బాంబు పేలుళ్లకు ఫిబ్రవరిలోనే కుట్ర జరిగినట్టు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. అరెస్టయిన నలుగురూ ఈ ఏడాది ఫిబ్రవరిలో హాజీ సలీం నివాసంలో సమావేశమై కదిలే రైళ్లలో మంటలు చెలరేగేలా బాంబులు పేల్చాలన్న కుట్రకు పథక రచన చేసినట్టు ఎన్ఐఏ గుర్తించింది. పాకిస్తాన్ నుంచి ఇక్బాల్ ఆదేశాలకు హాజీ సలీం నేరుగా అందుకునేవాడు. వాటిని మిగతా ముగ్గురికీ చేరవేసేవాడు. ఉగ్రవాద చర్యలకు అవసరమైన నిధులను ఇక్బాల్ పాకిస్తాన్‌ నుంచి పంపిస్తుంటే, హాజీ సలీం ఆ డబ్బును హవాలా లేదా ఇతర మార్గాల్లో మిగతావారికి అందించేవాడు.

మార్కెట్లో దొరికే వస్తువులే  బాంబులు!

మూడు సార్లు పాకిస్తాన్ వెళ్లి వచ్చిన నాసిర్, స్థానికంగా మార్కెట్లో లభించే వస్తువులతో బాంబులను తయారు చేయడంలో శిక్షణ పొందాడు. ఎరువుగా ఉపయోగించే అమ్మోనియం నైట్రేట్, టాయిలెట్లు శుభ్రం చేయడానికి ఉపయోగించే సల్ఫ్యూరిక్ యాసిడ్ సహా మరికొన్ని పదార్థాల మిశ్రమంతో బాంబు తయారు చేసినట్టు తెలిసింది. దర్భంగా స్టేషన్లో పేలుడు అనంతరం సేకరించిన శాంపిళ్లను కోల్‌కత్తా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ విశ్లేషించింది. పేలుడు తీవ్రత ఎక్కువ లేకపోయినా, ఎక్కువ నష్టం కల్గించాలన్న ఉద్దేశంతో కదిలే రైళ్లను లక్ష్యంగా చేసుకున్నట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. నేరుగా బాంబును ప్రయాణికుల బోగీలో పెడితే, సీసీటీవీ కెమేరాల్లో దొరికే అవకాశం ఉంటుందని, లేదంటే ప్రయాణికులకైనా అనుమానం కలిగి పోలీసులను అప్రమత్తం చేసే అవకాశం ఉంటుందని ఉగ్రవాదులు భావించారు. అందుకే ఏజెంట్ ద్వారా తెలివిగా పార్శిల్ బుకింగ్ చేసి సీసీటీవీ కెమేరాల్లో చిక్కకుండా తప్పించుకోవాలని భావించారు. పైగా లగేజ్ వ్యాన్‌లో ఉండే మిగతా వస్తువుల్లో చాలా వరకు మంటలకు మరింత ఊతమిచ్చే పదార్థాలే ఉంటాయని, వేగంగా వెళ్తున్న సమయంలో పేలితే మంటలు వేగంగా మిగతా బోగీలకు వ్యాప్తి చెందుతాయని భావించారు.

ఒక కేసు – అనేక విభాగాల దర్యాప్తు

దర్భంగా స్టేషన్లో పేలుడు కేసును ప్రధానంగా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నప్పటికీ, సమాంతరంగా బిహార్, యూపీ, తెలంగాణ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. బాంబు పేలిన దర్భంగా స్టేషన్ బిహార్లో ఉన్నందున బిహార్ ఏటీఎస్ రంగంలోకి దిగింది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పార్శిల్ బాంబు బుక్ చేసిన మాలిక్ బ్రదర్స్ ను హైదరాబాద్ నగరంలోనే అరెస్టు చేసినందున తెలంగాణ పోలీసులు, నిందితులందరి సొంతూరు కైరానా కేంద్రంగా కుట్ర జరిగినందున యూపీ పోలీసులు కూడా సమాంతరంగా దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు కేంద్ర నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) కూడా ఎన్ఐఏ దర్యాప్తుకు అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నట్టు తెలిసింది. క్రెడిట్ సొంతం చేసుకోవడం కోసం పోటీ పడే దర్యాప్తు సంస్థల మధ్య ఎంతమేర సమన్వయం ఉందన్న విషయం పక్కనపెడితే, సరికొత్త పద్ధతుల్లో భారీ ప్రాణనష్టం కల్గించేందుకు ఉగ్రవాదులు అమలుచేస్తున్న సరికొత్త పద్ధతులు సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయని చెప్పవచ్చు.

Also Read: Darbhanga blast case: మీరు కూడా టెర్రర్ కుట్రలో ఇరుక్కోవచ్చు.. జర భద్రం..! దర్భాంగ కేసులో చిక్కుకున్న ఓ సామాన్యుడు..

Darbhanga Blast Case: దర్భాంగ బ్లాస్ట్ కేసులో మరో ట్విస్ట్..! అందులో ఉన్నది ఇద్దరు కాదు.. ముగ్గురు..!

Latest Articles
దిన ఫలాలు (మే 1, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మే 1, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే