Darbhanga Blast Case: దర్భాంగ బ్లాస్ట్ కేసులో మరో ట్విస్ట్..! అందులో ఉన్నది ఇద్దరు కాదు.. ముగ్గురు..!

తవ్విన కొద్ది నిజాలు టెర్రర్ లింకులు వెలుగు చూస్తున్నాయి. ముష్కరమూక జాడలు చాలా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఇమ్రాన్, నాసిర్‌ బ్రదర్స్‌ను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్లు ఇద్దరు కాదు.. ముగ్గురు అని తేలింది. వీళ్లకు మహా టెర్రర్..

Darbhanga Blast Case: దర్భాంగ బ్లాస్ట్ కేసులో మరో ట్విస్ట్..! అందులో ఉన్నది ఇద్దరు కాదు.. ముగ్గురు..!
Darbhanga Blast Case
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 02, 2021 | 11:54 AM

తవ్విన కొద్ది నిజాలు టెర్రర్ లింకులు వెలుగు చూస్తున్నాయి. ముష్కరమూక జాడలు చాలా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఇమ్రాన్, నాసిర్‌ బ్రదర్స్‌ను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్లు ఇద్దరు కాదు.. ముగ్గురు అని తేలింది. వీళ్లకు మహా టెర్రర్ నెట్‌వర్కే ఉన్నట్లు తెలుస్తోంది. అటు బీహార్‌లో, ఢిల్లీలో కేసులు నమోదయ్యాయి. అరెస్టయిన ఇద్దరు ఏ సమాచారం ఇస్తున్నారోగానీ వాళ్లు పెట్టుకున్న టార్గెట్ మాత్రం చాలా పెద్దదే అని తెలుస్తోంది. బ్లాస్ట్‌లు కాకుండా ప్రమాదాలు సృష్టించే పని పెట్టుకుని జనం చావును కోరుకుంటున్నారు.

ఈ ఇద్దరు మాలిక్ బ్రదర్స్ మల్లేపల్లిలో వీళ్లు నివాసం ఉంటున్నారు.  సెకండ్‌ ఫ్లోర్‌ ఉంటూ గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారం చేసుకుంటున్న బిల్డప్ ఇచ్చారుగానీ.. దర్భాంగకు పంపిన బట్టల మూటతో అసలు గుట్టు వీడిపోయింది. అరెస్ట్ తర్వాత పోలీసులు మల్లేపల్లిలోని ఆ ఇంటిని అణువణువూ గాలించారు. లోపలంతా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, బాంబుల తయారీకి వాడే పదార్థాలతో పాటు.. ఉగ్రసంబంధిత అనేక వస్తువులను కూడా NIA స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

సాదాసీదాగా బట్టల వ్యాపారం చేసుకునే వాళ్లే అయితే.. ఇంపోర్టెడ్ గ్యాడ్జెట్స్‌తో పనేంటి? సల్ఫర్‌, సల్‌ఫ్యూరిక్ యాసిడ్‌తో అవసరం ఏంటి? బాంబుల తయారీ మెటీరియల్‌తో లింకేంటి? రోజువారీ వస్తూపోతూ.. ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా ఉగ్రకుట్రలు నెరుపుతున్నారు ఈ ఇద్దరు బ్రదర్స్. ఒకటీ రెండేళ్ల నుంచి కాదు… అక్షరాలా 20ఏళ్ల నుంచి మల్లేపల్లే అడ్డాగా చేసుకుని టెర్రర్ బిజినెస్ చేస్తున్నారు.

దర్భాంగకు పంపిన బట్టల మూట, అందులో ద్రవరూపంలో ఉన్న ప్రమాదకారకాలు, అవి మంట పుట్టించడం.. ఆ తర్వాత దర్భంగా నుంచి హైదరాబాద్‌కి సీన్ మారడంతో ఈ ఇద్దరు బయటపడ్డారుగానీ లేదంటే ఇంకా ఎన్ని ఘోరాలకు స్కెచ్ వేసేవాళ్లు. అసలు ఇన్నాళ్లూ ఈ 20 ఏళ్లలో జరిగిన మ్యాన్‌మేడ్‌ కల్లోలాల్లో వీళ్ల హస్తమెంతో ప్రస్తుం పోలీసులు కూపీ లాగే పనిలో పడ్డారు.. ! చూద్దాం ఈ లింకులు ఎవరిని టచ్‌ చేస్తాయో..! ఇప్పటి వరకు పట్టుబడింది.. ఘటనకు పాల్పడింది ఈ ఇద్దరు బ్రదర్స్ మాత్రమే అనుకుంటున్నారు.. కానీ మరో వ్యక్తి కూడా ఉన్నట్లుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే ఆ కనిపించని మూడో వ్యక్తి ఎవరు..? అంతు చిక్కని ఈ ప్రశ్నకు పులిస్టాప్ పెడతా మంటున్నాయి నిఘా వర్గాలు.

ఇవి కూడా చదవండి : Drug Racket: నిన్న టెర్రర్ లింక్.. ఇవాళ డ్రగ్స్ మాఫియా.. ఇద్దరు విదేశీ విద్యార్థులు అరెస్ట్

Hyderabad Metro Timings: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక పరుగుల సమయం మారింది.. గమనించారా..