Drowning: చెరువులో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి.. షణ్ముగపురంలో విషాదం..
Three children drowned in a pond: తమిళనాడులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తెన్‌కాశి ఆలంకుళం సమీపంలో నీటమునిగి ముగ్గురు చిన్నారులు
Three children drowned in a pond: తమిళనాడులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తెన్‌కాశి ఆలంకుళం సమీపంలో నీటమునిగి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. షణ్ముగపురం గ్రామానికి చెందిన భవన్ (4), షణ్ముగప్రియ (5), ఇషాంత్ (5)లు గురువారం మధ్యాహ్నం గ్రామంలోని చెరువు వద్ద ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో వారు నీటిలోకి దిగారు. ఒక్కసారిగా లోతైన ప్రాంతానికి వెళ్లడంతో వారంతా నీటమునిగి మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని చేరువులో గాలించగా.. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తిరుప్పూర్‌లో మరో ఇద్దరు చిన్నారులు..
ఇదిలాఉంటే.. తిరుప్పూర్ మంగలం సమీపం పల్లిపాళయంలో రాళ్ల క్వారీల దగ్గర ఆడుకుంటూ.. కిందపడి గ్రామానికి చెందిన సంఘవి (11) సాంతను (8) మరణించారు. గురువారం మధ్యాహ్నం ఆ క్వారీల దగ్గర ఆడుకుంటున్న సమయంలో కాలుజారి కిందపడి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తిరుప్పూర్ పోలీసులు వెల్లడించారు. ఈ రెండు ఘటనలతో ఆయా గ్రామాల్లో విషాదం నెలకొంది.
Also Read: