Road Stolen: రాత్రికి రాత్రే కిలోమీటర్ రోడ్డు మాయమైంది.. వెతికి పెట్టండి.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన గ్రామస్థులు..
Road Stolen Overnight Villagers File Complaint: సాధారణంగా పోలీస్‌స్టేషన్‌కు ఎన్నో నేర కేసులు వస్తుంటాయి. అలాంటి వాటిల్లో కొన్ని
Road Stolen Overnight Villagers File Complaint: సాధారణంగా పోలీస్‌స్టేషన్‌కు ఎన్నో నేర కేసులు వస్తుంటాయి. అలాంటి వాటిల్లో కొన్ని విచిత్రమైన కేసులను మనం చూస్తుంటాం. వింటుంటాం.. కోడి పోయిందనో.. లేకపోతే ఏదో వస్తువు పోయిందనో.. స్టేషన్ మెట్లెక్కిన వారిని చూశాం.. తాజాగా నమోదైన కేసు గురించి వింటే మీరే ఆశ్చర్యపోయి నవ్వుకుంటారు. నిధుల దుర్వినియోగంతో విసిగిపోయిన ఆ గ్రామస్థులు కిలోమీటర్ మేర రోడ్డు మాయమైందని.. వెతికి తీసుకురావాలంటూ పోలీస్‌స్టేషన్, పంచాయతీ కార్యాలయం మెట్లెక్కారు. తీరా ఖంగు తిన్న పోలీసులు జరిగిన విషయాన్ని తెలుసుకొని.. ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటైన సిధి జిల్లాలోని మంజోలి జనపద్ పంచాయతీ పరిధిలోని మేంద్ర గ్రామంలో ఈ వింత సంఘటన జరిగింది.
రాష్ట్రంలోని సిధి జిల్లాలోని ఒక మారుమూల గ్రామమైన మేంద్రాలో ఒక కిలోమీటర్ మేర రహదారి రాత్రిపూట అదృశ్యమైందని పోలీసులకు ఫిర్యాదుచేశారు. గ్రామానికి చెందిన డిప్యూటీ సర్పంచ్, స్థానికులు స్థానిక మంజోలి పోలీస్ స్టేషన్‌కు చేరుకొని అదృశ్యం గురించి ఫిర్యాదు చేశారు. రాత్రి రోడ్డు బాగానే ఉందని.. తెల్లవారే సరికి మాయమైందంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు తమ గ్రామానిది కాదని తెలిపారు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అయితే.. గ్రామంలో రూ.10 లక్షల నిధులతో రోడ్డును నిర్మించారు. ఈ క్రమంలో వర్షాలు పడటంతో రోడ్డు పూర్తిగా కనుమరుగైంది. బురద బురద మారడంతో ఆగ్రహించిన సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామస్థులు.. రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్‌ను సంప్రదించారు. కాంట్రాక్టర్ స్పందించకపోవడంతో గ్రామస్థులు రోడ్డు పోయిందంటూ పోలీసుల దగ్గరికి వెళ్లారు. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. విచారణ అనంతరం నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకుంటామని సిధి జిల్లా అధికారులు తెలిపారు.
Also Read: