AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Idhayam Trust: అనాధాశ్రమం పేరిట వ్యాపారం.. ‘ఇదయం ట్రస్ట్‌’ నుంచి 16 మంది పిల్లలు మాయం..

16 childrens missing from Idhayam Trust: తమిళనాడులో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ అనాధాశ్రమం నుంచి 16 మంది

Idhayam Trust: అనాధాశ్రమం పేరిట వ్యాపారం.. ‘ఇదయం ట్రస్ట్‌’ నుంచి 16 మంది పిల్లలు మాయం..
childrens missing
Shaik Madar Saheb
|

Updated on: Jul 02, 2021 | 11:00 AM

Share

16 childrens missing from Idhayam Trust: తమిళనాడులో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ అనాధాశ్రమం నుంచి 16 మంది పిల్లలు మాయం అయ్యారు. వారంతా కరోనాతో చనిపోయారని ట్రస్ట్ నిర్వాహకులు నాటకం ఆడారు. తమిళనాడులోని మధురై జిల్లా మేలూరులోని ఇదయం ట్రస్ట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రస్ట్ సభ్యులు వారం క్రితం మాణిక్కం అనే ఓ బాలుడిని, పావని అనే బాలికను రూ.5 లక్షలకు విక్రయించారు. ఈ క్రమంలో.. మాణిక్కం తల్లి చూడటానికి రావడంతో ఈ వ్యవహారమంతా బయటపడింది. కరోనాతో బాలుడు చనిపోయాడంటూ ట్రస్ట్ సభ్యులు చెప్పారు. దీంతో ఆ తల్లి అనూమానంతో పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగడతంతో ట్రస్ట్ నిర్వాహకులు శివకూమార్,మదర్షా పరారయ్యారు.

పోలీసులు ఈ కేసుపై దృష్టిసారించారు. చిన్నారులను కొనుగోలు చేసిన సక్కుబాయ్‌, సాదిక్‌, కన్నన్‌, భవానీ దంపతులను అరెస్ట్ చేసి.. పిల్లలను వారి దగ్గరినుంచి రక్షించారు. ఆశ్రమం సిబ్బంది ఏడుగురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఆశ్రమంలోని 38 మంది పురుషులు, 35 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులను వేర్వేరు ప్రాంతాల్లోని అనాథాశ్రమాలకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన అనంతరం ఇదయం ట్రస్టు ఆశ్రమానికి సీలు వేశారు. అయితే.. వేయి మందికి పైగా అనాథలకు అంత్యక్రియలు నిర్వహించామంటూ కొన్ని రోజుల క్రితం ఈ ఫౌండేషన్‌ నిర్వాహకులు అవార్డు అందుకున్నారు. అయితే.. ఈ ఆశ్రమం నుంచి ఇప్పటివరకు మొత్తం 60 కి పైగా పిల్లలు అదృశ్యం అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతోపాటు ట్రస్ట్ నిర్వాహకులు శివకూమార్,మదర్శ కోసం గాలిస్తున్నారు.

Also Read :

Drug Racket: నిన్న టెర్రర్ లింక్.. ఇవాళ డ్రగ్స్ మాఫియా.. ఇద్దరు విదేశీ విద్యార్థులు అరెస్ట్

Zookeeper Dies: నాలుగేళ్లుగా పాములకు పాలు పోసి పెంచాడు.. చివరకు కోబ్రా కాటుకే బలయ్యాడు.. జూ కీపర్ ఉదంతం..