Curd: పెరుగు ఆరోగ్యానికి మంచిదే అయినా..? ఈ పదార్థాలతో కలిపి తింటే ఇబ్బందులకు గురి కావాల్సిందే..!

Curd: పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మన పెద్దలు చెప్పేమాట. అందుకు వైద్యులు కూడా పెరుగు మంచిదేనని సూచిస్తుంటారు. పెరుగు తినడం వల్ల..

Curd: పెరుగు ఆరోగ్యానికి మంచిదే అయినా..? ఈ పదార్థాలతో కలిపి తింటే ఇబ్బందులకు గురి కావాల్సిందే..!
Follow us
Subhash Goud

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 02, 2021 | 9:17 AM

Curd: పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మన పెద్దలు చెప్పేమాట. అందుకు వైద్యులు కూడా పెరుగు మంచిదేనని సూచిస్తుంటారు. పెరుగు తినడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే పెరుగులో కాల్షియం అధిక మొత్తంలో లభిస్తుంది. దీనివల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు రోజూ కప్పు పెరుగు తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అయితే ఇలా ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి ఔషధంలా పని చేసే పెరుగుని మనం ఎక్కవగా ఇతర ఆహారంతో కలిపే తీసుకుంటుంటాం. అయితే పెరుగు కొన్ని పదార్థాలతో కలిపి తీసుకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓ సారి చూసేద్ధాం.

మామిడి:

పెరుగును మామిడి పండుతో కలిపి ఎప్పుడు తినకూడదు. అలా కలిపి తినడం వల్ల శరీరంలో అలర్జీ, చర్మ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. వేసవి కాలం వచ్చిందంటే చాలు ఈ రెండు కలిపి తినడం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో మామిడి పండు, పెరుగు కలిపి తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఉల్లిపాయలతో కలిపి పెరుగు.. ఉల్లిపాయలతో కలిపి పెరుగు తినడం అంత మంచిది కాదు. ఉల్లి శరీరంలో వేడిని పుట్టిస్తే, పెరుగు చల్లదనానికి కారణమవుతుంది. ఈ రెండు కలిపి తినడం వల్ల సోరియాసిస్‌, దద్దుర్ల వంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

పాలు, పెరుగు:

ఇక పెరుగును పాలతో కలిపి తినడం కూడా అంత మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. రెండు తెల్లగానే ఉన్నా.. సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ రెండు కలిపి తినడం వల్ల డయేరియాతో పాటు ఇతర జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు నిపుణులు.

చేపలతో పెరుగు:

పెరుగు, చేపలు ఈ రెండింటిలో ప్రోటీన్లు అధిక మోతాదులో ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల కడుపులో గ్యాస్‌ సమస్య వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

ఇవీ కూడా చదవండి

Women Lose Weight : డెలీవరీ తర్వాత మహిళలు ఈ 5 మార్గాల్లో సులువుగా బరువు తగ్గించుకోవచ్చు..!

White Pepper: క్యాన్సర్‏ను నయం చేసే తెల్ల మిరియాలు.. నల్ల మిరియాల కంటే తెల్ల మిరియాలు ఆరోగ్యానికి ఎంత వరకు మేలు చేస్తాయంటే..