Pace Maker: బ్యాటరీ లేకుండా పనిచేసే తాత్కాలిక పేస్‌మేకర్‌ సృష్టించిన శాస్త్రవేత్తలు 

Pace Maker: బ్యాటరీ లేకుండా పనిచేసే  ప్రపంచంలోనే మొట్టమొదటి వైర్‌లెస్ పేస్‌మేకర్‌ను శాస్త్రవేత్తలు సృష్టించారు.

Pace Maker: బ్యాటరీ లేకుండా పనిచేసే తాత్కాలిక పేస్‌మేకర్‌ సృష్టించిన శాస్త్రవేత్తలు 
Pace Maker
Follow us
KVD Varma

|

Updated on: Jul 01, 2021 | 10:34 PM

Pace Maker: బ్యాటరీ లేకుండా పనిచేసే  ప్రపంచంలోనే మొట్టమొదటి వైర్‌లెస్ పేస్‌మేకర్‌ను శాస్త్రవేత్తలు సృష్టించారు. దీనిలో ప్రత్యేకత  ఏమిటంటే, ఈ ఇంప్లాంట్ శరీరం నుండి తొలగించాల్సిన అవసరం లేదు, అది స్వయంగా కరిగిపోతుంది.  తాత్కాలిక పేస్‌మేకర్‌కు ఇది మంచి ప్రత్యామ్నాయం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతకు ముందు పేస్ మేకర్  ఇంప్లాంటేషన్ చేసిన కొన్నిరోజుల  తర్వాత శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి వచ్చేది.

తాత్కాలికంగా పేస్‌మేకర్ అవసరమయ్యే కేసుల్లో ఇది మంచి ప్రత్యామ్నాయం కాగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కొంతమంది రోగులకు ఓపెన్ హార్ట్ సర్జరీ, గుండెపోటు , ఔషధ అధిక మోతాదు తీసుకున్న వారికీ  తాత్కాలిక పేస్‌మేకర్ అవసరం అవుతుంది. సాధారణంగా ఇటువంటి సమయంలో దానికోసం మళ్ళీ మళ్ళీ శాస్త్ర చికిత్స అవసరం అవుతుంది. అయితే.. ఈ తాత్కాలిక పేస్ మేకర్ తో ఆ బాధలు తప్పుతాయి. గుండె యధాస్థితికి వచ్చిన తరువాత ఇప్పుడు వాడుతున్న ఫేస్ మేకర్ లను తొలగించడం పెద్ద పనిగా ఉండేది. కానీ, ఈ తాజా పరికరంతో అటువంటి అవసరం ఉండదు.

ఇది చాలా సన్నగా, తేలికగా ఉంటుంది. 5 నుండి 7 వారాలలో కరిగిపోయే ఈ పేస్‌మేకర్‌ను అభివృద్ధి చేసిన నార్త్‌వెస్టర్న్, జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని  చెప్పారు. ఇది తనను తాను ఛార్జ్ చేయడానికి శరీరం వెలుపల ఉంచిన రిమోట్ యాంటెన్నాను ఉపయోగిస్తుంది. ఇది 5 నుండి 7 వారాలలో శరీరంలో స్వయంచాలకంగా కరిగిపోయే బయో మెటీరియల్‌తో తయారవుతుంది.

ఇది ఇన్ఫెక్షన్ల ప్రమాదాయాన్ని తగ్గిస్తుంది..

పరిశోధకుడు జాన్ ఎ. రోజర్, పేస్‌మేకర్‌లో , గుండె చుట్టూ హార్డ్‌వేర్ ఉంచడం వల్ల రోగికి ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అయితే అందులో భారీ బ్యాటరీ లేకపోవడం వల్ల ఇది తేలికైనది. ఇది సంక్రమణకు గురయ్యే అవకాశాలను తగ్గిస్తుంది.  ఫలితంగా, ఇది తక్కువ ఖర్చుతో రోగికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ పరికరం మానవులపై ఎంతకాలంలో  ఉపయోగం కోసం సిద్ధంగా ఉంటుందో, దాని ఖర్చు ఎంత ఉంటుందో శాస్త్రవేత్తలు స్పష్టం చేయలేదు.

Also Read: Malaria: ఏడు దశాబ్దాల నిరంతర ప్రయత్నం..మలేరియా రహిత దేశంగా చైనా!

Cytomegalovirus: కరోనాతో బాధపడుతున్న వారిని ఇబ్బంది పెడుతున్న మరో వైరస్.. ఢిల్లీ లో వెలుగులోకి 

Pace Maker, Pace Maker without Battery, Hear Patients, Implantation, open heart surgery