AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Joe Biden: ట్రంప్ రికార్డు బ్రేక్ చేసిన అధ్యక్షుడు జో బైడెన్.. 130 మంది భారత సంతతి వ్యక్తులకు చోటు

ట్రంప్ రికార్డు బ్రేక్ చేశారు అధ్యక్షుడు జో బైడెన్..ఆయన పాలనా యంత్రాంగంలో ఏకంగా 130మందికిపైగా భారత సంతతి వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించి రికార్డు సృష్టించారు.

Joe Biden: ట్రంప్ రికార్డు బ్రేక్ చేసిన అధ్యక్షుడు జో బైడెన్.. 130 మంది భారత సంతతి వ్యక్తులకు చోటు
Joe Biden, Kamala Harris
Shaik Madar Saheb
|

Updated on: Aug 25, 2022 | 7:16 AM

Share

Indian-Americans: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయన పాలనా యంత్రాంగంలో ఏకంగా 130మందికిపైగా భారత సంతతి వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించారు. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో వీరికి చోటు కల్పించారు. అమెరికా జనాభాలో దాదాపు ఒక్క శాతం ఉన్న భారత సంతతి వ్యక్తులకు ఇంత ప్రాధాన్యం ఇవ్వడం ఇదే తొలిసారి. 2020 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలోనే భారత సంతతి వ్యక్తులకు సముచిత స్థానం కల్పిస్తామని హమీ ఇచ్చారు బైడెన్. ఇచ్చిన మాట ప్రకారం ఆ హామీని నిలబెట్టుకున్నారు. అంతేకాదు అమెరికా చరిత్రలోనే తొలిసారి భారత సంతతికి చెందిన మహిళ కమలా హ్యారిస్‌కు ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ పాలనా యంత్రాంగంలో 80 మంది భారత సంతతి వ్యక్తులు ఉండేవారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ సంఖ్య 60గా ఉంది.

బైడెన్ మాత్రం గత ప్రభుత్వాలతో పోల్చితే రికార్డు స్థాయిలో 130మందికిపైగా భారత సంతతి వ్యక్తులకు చోటు కల్పించారు. దీంతో వైట్‌హౌస్‌లో ఏ సమావేశం జరిగినా అందులో తప్పనిసరిగా భారత సంతతి వ్యక్తులుంటారు. వీరు లేకుండా సమావేశాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అంతేకాదు ప్రతినిధుల సభలో నలుగురు సభ్యులు సహా మొత్తం 40 మంది భారత సంతతి వ్యక్తులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. అమెరికాలోని దాదాపు 20 టాప్ కంపెనీలకు కూడా CEOలుగా భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారు.రనాల్డ్‌ రీగన్‌ తొలిసారి భారతీయులను అధ్యక్ష కార్యవర్గంలోకి తీసుకోవడం మొదలుపెట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..