AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ సమస్యల పరిష్కారంపై కేంద్రం ఫోకస్.. నేడు ప్రత్యేక కమిటీతో కీలక సమావేశం

సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిటీ గురువారం (నేడు) మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుంది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది.

Andhra Pradesh: ఏపీ సమస్యల పరిష్కారంపై కేంద్రం ఫోకస్.. నేడు ప్రత్యేక కమిటీతో కీలక సమావేశం
Cm Jagan Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Aug 25, 2022 | 7:02 AM

Share

Center’s focus on AP problems: ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిటీ గురువారం (నేడు) మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుంది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధుల బృందంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి, ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్.ఎస్. రావత్‌తో పాటు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్, మరికొందరు ఉన్నతాధికారులు ఉన్నారు. గురువారం జరగబోయే సమావేశంలో ప్రస్తావించాల్సిన సమస్యలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి పూర్తి వివరాలను సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో బృందంలోని అధికారులు, నేతలు సమావేశమయ్యారు.

కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం పొందాల్సిన ప్రాజెక్టులు, వివిధ శాఖల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిల గురించి సమగ్ర నివేదిక సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. ఇందులో పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ఆమోదం ప్రధానాంశం కానుంది. టెక్నికల్‌ అడ్వైజర్‌ కమిటీ నిర్ధారించిన ప్రాజెక్టు వ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి తాజా ఢిల్లీ పర్యటనలో ప్రధానిని కోరారు. అలాగే ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్లవారిగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టిన సొమ్మును తిరిగి చెల్లించే విధానానికి విధానానికి స్వస్తి చెప్పాలని, ఇది పనుల్లో జాప్యానికి కారణమవుతోందని వెల్లడించారు.

అన్ని జాతీయ ప్రాజెక్టుల్లో వ్యవహరించినట్టుగానే మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణలోకి తీసుకుని ఆమేరకు చేస్తున్న పనులకు వెంటనే రియంబర్స్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 2,900 కోట్లు తక్షణమే విడుదల చేయాలని ఏపీ ప్రతినిధుల బృందం కేంద్రాన్ని కోరనున్నట్టు తెలిసింది. మరోవైపు రీసోర్స్‌గ్యాప్‌ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ. 32,625.25 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖను కోరే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

వీటితో పాటు వేర్వేరు శాఖల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బకాయిలు, కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వైద్య కళాశాలల నిర్మాణానికి ఆర్థిక సహాయం, వేర్వేరు ప్రాజెక్టులకు నిధుల మంజూరు అంశాలను ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..