Hyderabad: లా అండ్ ఆర్డర్‌పై సీఎం హై లెవల్ మీటింగ్.. రంగంలోకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్.. ఆ ప్రాంతాల్లో ఆంక్షలు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద కామెంట్స్‌పై హైదరాబాద్​లో రెండో రోజు నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అలాగే బండి సంజయ్ అరెస్ట్​ నేపథ్యంలో బీజేపీ పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తోంది. దీంతో సర్కార్ అలెర్టయ్యింది.

Hyderabad: లా అండ్ ఆర్డర్‌పై సీఎం హై లెవల్ మీటింగ్.. రంగంలోకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్.. ఆ ప్రాంతాల్లో ఆంక్షలు
Rapid Action Force
Follow us

|

Updated on: Aug 24, 2022 | 7:27 PM

Telangana: హైదరాబాద్‌ పాతబస్తీలో హై టెన్షన్‌ నెలకొంది. రాజాసింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో భారీగా బలగాలను మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఆంక్షలు కఠినతరం చేశారు. 14 ప్రాంతాలను సెన్సిటివ్ ఏరియాలుగా గుర్తించి భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌(Rapid Action Force)ను రంగంలోకి దింపారు. ఇప్పటికే మతపెద్దలతో చర్చలు జరిపిన పోలీసులు..ఆందోళనలు జరగకుండా చూడాలని సూచించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పాతబస్తీలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని ప్రకటించారు పోలీసులు. ప్రస్తుతం పరిస్థితులు కంట్రోల్‌లోనే ఉన్నాయని..సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని కోరారు సౌత్‌ జోన్‌ డీసీపీ చైతన్య.  రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్ రంగంలోకి దిగింది. షాలిబండ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించింది రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్. ఈస్ట్‌, సౌత్‌ జోన్లలో కూడా పోలీసుల ఆంక్షలు విధించారు. గోషామహల్‌ వెళ్లే ప్రధాన రహదారులన్నింటినీ పూర్తిగా మూసివేశారు పోలీసులు.  మీర్‌చౌక్, గోషామహల్, చార్మినార్ ప్రాంతాల్లో బలగాలను మోహరించారు.

రాజాసింగ్ ఉదంతం హైదరాబాద్‌లో ఒక్కసారిగా హైటెన్షన్‌ వాతావరణాన్ని క్రియేట్‌ చేయడంతో.. అలర్టయ్యింది ప్రభుత్వం. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులతో స్పెషల్‌గా మీటయ్యారు సీఎం కేసీఆర్‌.  డీజీపీ, లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ డీజీ సహా ఇద్దరు ఐజీలు, ముగ్గురు సీపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపైనే ఈ మీటింగ్‌లో ప్రధానంగా చర్చ జరిగింది. ప్రతీక్షణం అలర్ట్‌గా ఉండాలని.. పోలీసులకు సూచించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. మరోవైపు, రాజాసింగ్‌ వ్యవహారంలో పాతబస్తీ ఇంకా హాట్‌హాట్‌గానే ఉంది. రాజాసింగ్‌ వ్యతిరేకవర్గం ఇవాళ కూడా ఆందోళనలు కొనసాగించింది. వివాదాస్పద వీడియోలతో ఓ వర్గాన్ని కించపరిచిన ఎమ్మెల్యేను వెంటే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ పలుచోట్ల ర్యాలీలు నిర్వహించారు. తాజాగా  ఆందోళన చేస్తున్న మరో 20 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Latest Articles